Home News ఎస్పీ & ఆర్జేడీ గుర్తింపు రద్దు కోసం సీఈసీని కలవనున్న VHP

ఎస్పీ & ఆర్జేడీ గుర్తింపు రద్దు కోసం సీఈసీని కలవనున్న VHP

0
SHARE

న్యూఢిల్లీ: సమాజ్‌వాదీ పార్టీ (SP), రాష్ట్రీయ జనతాదళ్ (RJD) రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని విశ్వ హిందూ పరిషత్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ అలోక్ కుమార్ జీ డిమాండ్ చేశారు. ఈ మేర‌కు ఆయ‌న భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను క‌ల‌సి విజ్ఞ‌ప్తి చేయనున్నారు.

ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 29Aపై CEC దృష్టి సారించాల‌ని, దీని ప్రకారం ప్రతినమోదిత రాజకీయ పార్టీ మెమోరాండమ్‌లో పార్టీ నిజమైన విశ్వాసం, విధేయతతో సహా లౌకికవాదం, ప్రజాస్వామ్య‌బ‌ద్ధ‌మైన ఒక నిర్దిష్ట నిబంధనను కలిగి ఉండాల‌నే విష‌యాల్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల‌ని ఆయ‌న కోరారు.

స‌మాజ్‌వాద్ పార్టీకి చెందిన స్వామి ప్రసాద్ మౌర్య ఇటీవల రామచరిత్ మానస్ ను కించపరుస్తూ దాని పేజీలను తగులబెట్టడం లాంటి వ్యాఖ్య‌ల‌పై భారతదేశంలోని విస్తారమైన పౌరుల మతపరమైన భావాలను ఆగ్రహానికి గురిచేసే ఉద్దేశపూర్వక హానికరమైనవ‌ని వి.హెచ్‌.పీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. మౌర్య వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన వెంటనే పార్టీ ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి పొందడం గ‌మ‌నిస్తే ఆయన వ్యాఖ్య‌ల‌కు పార్టీ మొత్తం మద్దతు ఉందని రుజువు చేస్తున్నద‌ని వీ.హెచ్‌.పీ పేర్కొంది.

అదేవిధంగా, రామచరిత్ మానస్‌ పై నిషేధం విధించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రీయ జనతా దళ్‌కు చెందిన డాక్టర్ చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్య‌లు, ఇతర పవిత్ర గ్రంథాలపై ఉద్దేశపూర్వకంగా వివాదాస్ప‌ద విమర్శలు చేయడం ఆగ్రహాన్ని కలిగించడానికి, హిందూ సమాజంలోని వివిధ వర్గాల మధ్య అపనమ్మకం విభజనను సృష్టించే ప్రయత్నంగా పరిగణించబడుతుంద‌ని వి.హెచ్‌.పీ పేర్కొంది. రాష్ట్రీయ జనతాదళ్ ఇప్ప‌టి వ‌ర‌కు ఆ వ్య‌క్తిపై ఎటువంటి చర్య తీసుకోలేదని, ఆ ప్రకటనకు పార్టీ మద్దతు ఉందని రుజువు చేసిందని వి.హెచ్‌.పీ పేర్కొంది.

సమాజ్‌వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్ పార్టీలు ప్రాథమిక షరతులను ఉల్లంఘించాయని వారి రిజిస్ట్రేషన్ ఉపసంహరణకు బాధ్యులుగా మారాయని VHP వర్కింగ్ ప్రెసిడెంట్ తెలిపారు.