సామా జగన్మోహన్ రెడ్డి
జెండదించి నల్లజెండ నెగురవేయ
తరిమికొట్ట వచ్చి తానునిల్చి
జాతిజెండ కొరకు జగనన్నమరుడాయె
వినుర భారతీయ వీర చరిత
భావము
కాకతీయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో స్వాతంత్ర్య దినోత్సవం రోజున జాతీయ పతాకాన్ని దించి నల్లజెండాను ఎగుర వేసిన నక్సలైట్లను సామా జగన్మోహన్ రెడ్డి ఎదిరించారు. వారి ముందే తిరిగి జాతీయ జెండాను ఎగురవేశారు. అది సహించలేని ముష్కరులు సాక్ష్యం చెప్పడానికి కోర్టుకు వస్తున్న ఆయన్ను వెనుక నుంచి తుపాకులతో కాల్చారు. జాతీయ జెండా కోసం సామా జగన్మోహన్ రెడ్డి అమరుడైనారు. ఇలా భారత్కు స్వరాజ్యం సిద్ధించిన తర్వాత జాతీయ పతాక రక్షణ కోసం అమరుడైన వీరుని చరిత విను ఓ భారతీయుడా!
-రాంనరేష్