
మంగళ్ పాండే
జనులనెల్ల మిగుల జాగృత పర్చుచున్
ఫాలనేతృడోలె పాండె చెలగి
అమ్మ స్వేచ్చ కొరకు ఆహుతయ్యె నిచట
వినుర భారతీయ వీర చరిత
భావము
ప్రథమ స్వతంత్ర సంగ్రామానికి తోటి సైనికులను సమాయత్తం చేయుచుండగా, గమనించిన బ్రిటిష్ సైన్యాధికారులు బంధించరాగా, వారిపై తిరగబడి, మూడో కన్ను తెరచిన శివుని వోలె చెలరేగి, కాల్పులు జరిపి, చివరికి ఉరితో అమరుడైన మంగళ్ పాండే వీర చరిత విను ఓ భారతీయుడా!
రాంనరేష్