రాస్ బిహారీ బోస్
హత్య జేయదలచె హార్డింగునీతండు
మారువేషమేసి మాటమార్చె
ఆద్యుడయ్యె బోసు ఆజాదుహిందుకు
వినుర భారతీయ వీర చరిత
భావము
ఆంగ్లేయాధికారి లార్డ్ హార్డింగు హత్యకు పథకం వేసి విఫలమైన వీరుడు రాస్ బిహారీ బోస్. అనంతరం అజ్ఞాతంలోకి వెళ్ళారు. జపానుకు చేరుకున్నారు. అక్కడ జపానువాసిగా రూపాంతరం చెందారు. జపానులో యుద్ధ ఖైదీలైన భారతీయులతో భారత స్వతంత్ర సేనను స్థాపించారు. కడకు ఆ సేనను నేతాజీకి అప్పగించిన రాస్ బిహారీ బోస్ వీర చరిత విను ఓ భారతీయుడా!
-రాంనరేష్