రాణి చెన్నమ్మ
రాజ్యరక్ష కొరకు రాణి చెన్నమ్మతా
పిలుపునిచ్చి జనుల మేలుకొలిపె
జంపె కదనమునను జాను థాక్రేనట
వినుర భారతీయ వీర చరిత
భావము
1857 లో ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామానికి ముందు కర్నాటకలో కిట్టూరు రాజ్యాన్ని రాణి చెన్నమ్మ ఏలుతున్నారు. తన రాజ్యాన్ని కబళించడానికి వచ్చిన బ్రిటీష్ అధికారి జానా థ్యాకరేను హతమారుస్తారు. మరణాన్ని సైతం లెక్క చేయకుండా మాతృభూమిని కాపాడుకోవాలని పిలుపునిచ్చిన రాణి చెన్నమ్మ వీర చరిత విను ఓ భారతీయుడా!
-రాంనరేష్