
అల్లూరి సీతారామరాజు
తల్లి స్వేచ్చ కొరకు విల్లంబు ధరియించి
మన్యమంత తాను మలచి పోరి
అగ్ని వర్షమయ్యి నల్లూరి చెలరేగె
వినుర భారతీయ వీరచరిత
భావము
దేశ మాత స్వేచ్ఛ కోసం విల్లంబులు ధరించారు. మన్యంలోని వనవాసులందరినీ వీరులుగా తీర్చిదిద్దినారు. బ్రిటీషు వారిపై అగ్ని వర్షం కురిపించిన అల్లూరి సీతారామరాజు చరిత విను ఓ భారతీయుడా!
-రాంనరేష్