Home News వినుర భారతీయ వీర చరిత

వినుర భారతీయ వీర చరిత

0
SHARE

హనుమయ్య వస్తాదు

స్వేచ్ఛ కొరకు తాను సేన నిల్ప దలచి
యువతకితడు దెల్పె యుధ్ధ విద్య
కనుము ధీరగుణుడు హనుమయ్య వస్తాదు
వినుర భారతీయ వీరచరిత

భావము

భారత దేశానికి స్వాతంత్ర్యం కోసం సైన్యం తయారు చేయడానికి యువకులను సమీకరించారు. వ్యాయామశాలలు ఏర్పాటు చేసి వారికి యుద్ధవిద్యలు నేర్పారు. అటువంటి ధీరోదాత్తులు హనుమయ్య వస్తాదు చరిత్ర తెలుసుకో ఓ భారతీయుడా!

చరిత్ర

క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా ఇందూరులో కాంగార్ గ్రౌండ్‌లో స్వాతంత్ర్య సమరయోధులు హనుమయ్య వస్తాదు గర్జించారు. జైలు శిక్షను అనుభవించారు. నేతాజీ భరత్ జాతికి అందించిన ‘జైహింద్’ నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకున్నారు. రజాకార్లను ఎదిరించడం కోసమ చిన్నపాటి సైన్యాన్ని ఏర్పాటు చేశారు. యువతకు యుద్ధ విద్యలు నేర్పారు. అటువంటి ధన్యులు హనుమయ్య వస్తాదు.అటువంటి ధన్యుడు హనుమయ్య వస్తాదు.

-రాంనరేష్