Home News వినుర భారతీయ వీర చరిత

వినుర భారతీయ వీర చరిత

0
SHARE

వాసుదేవ బలవంత్ ఫడ్కే

రామొషి యను పేర రణవీరుల నిలిపి
వాసుదేవ ఫడకె వాసికెక్కె
తెగువ తోడ చెలగె తెల్లదొరలపైన
వినుర భారతీయ వీర చరిత

భావము: 

1876లో మహారాష్ట్రలో భయంకరమైన కరువు తాండవించినపుడు, ఆంగ్లేయులు ఉన్న పంటనంతటినీ ఎత్తుకుపోతే. వారిపై తిరుగుబాటు చేయడానికి ‘రామొషి’ అనే సైన్యాన్ని ఏర్పాటు చేసి, ఆంగ్లేయ వ్యాపారులను దోచి రైతులకు పంచారు స్వరాజ్య సమరయోధుడు వాసుదేవ్ బలవంత్ ఫడ్కే. ఆంగ్లేయులు వారి తలకు 5వేల రివార్డు ప్రకటిస్తే, ప్రతిగా ఆంగ్లేయుల తలకు 10వేలను ఫడ్కే ప్రకటించాడు. భారతీయులపై దుశ్చర్యలకు పాల్పడుతున్న తెల్ల దొరలను అత్యంత ధైర్య సాహసాలతో వాసుదేవ్ బలవంత్ ఫడ్కే ఎదుర్కొన్నారు. అంతటి వీరుని చరిత విను ఓ భారతీయుడా!

– రాంనరేష్