Home News శక్తివంతులం, జ్ఞానవంతులం కావాలి – డా. మోహన్ భాగవత్

శక్తివంతులం, జ్ఞానవంతులం కావాలి – డా. మోహన్ భాగవత్

0
SHARE

భాగ్యనగర్ గణేశనిమజ్జనోత్సవంలో సర్ సంఘచాలక్ ఉద్బోధన

గణేశ పూజను కేవలం వేడుకలా, ఉత్సవంలా మార్చివేయకూడదు. దీని ద్వారా హిందువులంతా సంస్కారాలను, సద్గుణాలను అలవరచుకునే ప్రయత్నం చేయాలి. కేవలం మంచితనం ఉంటే సరిపోదు. దానితోపాటు శక్తి కూడా ఉండాలి. ఆ శక్తి ఇతరులను హింసించడానికి కాకపోయినా ఇతరులు మనపై చేసే దాడిని ఎదుర్కొనేందుకు అవసరం. అలాంటి శక్తితోపాటు జ్ఞానం కూడా అవసరమని గణేశుడు మనకు చెపుతున్నాడు. ఈ గణేశ ఉత్సవాల ద్వారా హిందువులంతా ఈ గుణాలను అలవరచుకుని, సంఘటిత శక్తిగా నిలవాలి.’’అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ అన్నారు. భాగ్యనగర్ లో గణేశ నిమజ్జనోత్సవానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ఆయన గణేశ్ చౌక్ (మొజంజాహీ మార్కెట్ కూడలి) వద్ద భక్త సమూహాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.

జగదంబ, శక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవిని పూజించి గణేశుడు విశ్వాధిపత్యాన్ని పొందాడని, మనం జగదంబ స్వరూపమైన భారతమాత పూజలో జీవితాన్ని సార్ధకం చేసుకోవాలని ఆయన ఉద్బోధించారు. మన శక్తి, బుద్ధి భారతమాత భక్తి కోసమని, ఈ దేశంలోని జనం, జలం, జమీన్(భూమి), జాన్వర్ (జంతువుతులు) మొదలైనవాటిపై మనకు భక్తి ఉండాలని డా. భాగవత్ అన్నారు.

మనం ఎల్లప్పుడు జాగరూకతతో, అప్రమత్తంగా ఉండాలని, దేశాన్ని నాశనం చేయాలనుకునే శక్తులు సమాజంలో విభేదాలు సృష్టించడానికి రకరకాలుగా ప్రయత్నిస్తున్నాయని హెచ్చరించారు.

ప్రతి ఏడాది చేసే గణపతి పూజ ద్వారా మనం ఆయనలోని గుణాలను అలవరచుకునే ప్రయత్నం చేస్తామని, అందరి మేలు కోసం ఆ గుణాలను ఉపయోగించాలనే సందేశాన్ని కూడా గ్రహిస్తామని ఆయన అన్నారు. సర్వ శుభాలను చేకూర్చే గణేశుడు వచ్చే సంవత్సరం మరింత ముందుగా రావాలని కోరుకుందామని ఆయన తన ఉపన్యాసాన్ని ముగించారు.

అంతకుముందు డా. మోహన్ భగవత్ చార్మినార్ దగ్గర ఉన్న భాగ్యలక్ష్మి ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు.

శ్రీ స్వామి ప్రజ్ఞానంద, హరిద్వార్ పీఠం, శ్రీ ఆలే శ్యాం కుమార్, ఆర్.ఎస్.ఎస్ క్షేత్ర ప్రచారక్, శ్రీ దక్షిణామూర్తి, ప్రాంత సంఘచాలక్, శ్రీ కాచం రమేష్, ప్రాంత కర్యవాహ, శ్రీ రాఘవ రెడ్డి, వి.హెచ్.పి మాజీ అంతర్జాతీయ అధ్యక్షులు, శ్రీ రామరాజు, వి.హెచ్.పి రాష్ట్ర అధ్యక్షులు, శ్రీ భగవంత్ రావు, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి జనరల్ సెక్రటరీ, శ్రీ శశిధర్, ఉత్సవ సమితి సెక్రటరీ తో పాటు ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు

పూర్తి ప్రసంగానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి:

https://youtu.be/a-sfpo9CT7E