
‘యుద్ధం చేయకుండానే విజయం సాధించు’ అనే సూత్రాన్ని చైనా మన పైనా కూడా అమలు చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంది. ఒక పక్క నాసిరకమైన, చవకైనా వస్తువులతో మన మార్కెట్ ను ముంచెత్తడానికి ప్రయత్నిస్తోంది. మరోపక్క లడఖ్, అరుణాచల్, సిక్కిం మొదలైన ప్రాంతాల్లో నిరంతరం చొరబాట్లకు పాల్పడుతూ మన భూభాగాలను కబళించాలనుకుంటోంది. చైనా సాగిస్తున్న ఈ ప్రమాదకరమైన పరోక్ష యుద్ధం వల్ల మనం ఎంతో నష్టపోతున్నాం. మన భూభాగాల్లోకి చైనా చొరబాట్లను సరిహద్దుల్లో సైనికులు ఎదుర్కొంటున్నారు. అలాగే మార్కెట్ లో తన వస్తువుల ద్వారా చైనా పాల్పడుతున్న చొరబాటును ప్రజానీకం ఎదుర్కోవాలి. చైనా వస్తువులను బహిష్కరించాలి. ‘BE VOCAL FOR LOCAL’