Home News హిందుత్వంపై దాడిని సహించేది లేదు

హిందుత్వంపై దాడిని సహించేది లేదు

0
SHARE

హిందుత్వాన్ని, హిందూ దేవుళ్ళ ను అవమానిస్తున్న ఐలయ్యను అరెస్టు చేయడంలో ప్రభు త్వాలు వెనుకాడుతున్నాయంటూ స్వామీజీలు దుయ్య బెట్టారు. ”సనాతన హిందూ ధర్మాన్ని కించపరుస్తుంటే ఈ ప్రభుత్వాలు చూస్తుంటాయేమో.. మేం ఎంతమాత్రం సహిం చం.. కాషాయం కట్టినా పౌరుషం చచ్చిపోలేదు.. ఐలయ్యపై చర్యలు తీసుకోకుంటే మేమే ఆ బాధ్యతను తీసుకుంటాం.. సమాజంలో అశాంతిని, అంతర్గత కలహాల్ని పెంచుతున్న కంచ ఐలయ్య వంటి వారిని శిక్షించడంలో ఈ ప్రభుత్వాలు వెనుకాడుతు న్నాయి.. ఇది మాలోని సహనాన్ని హద్దులు దాటేలా చేస్తోంది.. ఇంకా మమ్మల్ని పరీక్షించొద్దు.. ఊరికి దూరంగా ఆశ్రమాల్లో ప్రశాంత వాతావరణం మధ్య జపతపాలు చేసుకునే స్వామీజీల్ని రోడ్డెక్కించిన ఆ ఐలయ్యను తక్షణం శిక్షించాలి.. వెంటనే చర్యలకు దిగకుంటే తామే శిక్షిస్తాం.. ఇందుకోసం ప్రతి హిందువు ఓ పరశురాముడౌతాడు.. చేతిలోని కాషా య జెండాయే గండ్రగొడ్డలి అవుతుంది” అంటూ ప్రభుత్వాన్ని స్వామీజీలు హెచ్చరించారు.

దేశంలో విశ్వధర్మ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో హిందూ ధర్మరక్షా సమితి, ఆర్యవైశ్య మహాసభలు సంయు క్తంగా నిర్వహించిన చలో కాకినాడ కార్యక్రమానికి వివిధ పీఠాల స్వామిజీలు, పెద్దెత్తున హిందువులు తరలొచ్చారు. నగరంలో భారీ ప్రదర్శన జరిపారు. అనంతరం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు.

అంతకుముందు బాలాజీచెరువు సెంటర్లో జరిగిన సభలో శ్రీ శివస్వామి, శ్రీ కమలానందభారతి స్వామి, శ్రీ శ్రీనివాసానంద స్వామిలు ప్రసంగించారు. పథకం ప్రకారం హిందుత్వాన్ని అంతమోదించే కుట్రకు పాల్పడుతున్నారని విమర్శించారు. ప్రపంచానికి దిక్సూచి అయిన హిందూమతాన్ని పరిరక్షించు కునేం దుకు ప్రతి హిందువు ఒక సైనికుడిలా పోరాడాల న్నారు. ప్రభుత్వం కల్పించిన పథకాలతో చదువుకుని ఇక్కడ పట్టాలు పొంది విదేశీ మిషనరీల డబ్బులు తీసుకుని హిందుత్వాన్ని విమర్శిస్తున్న కంచ ఐలయ్య వంటి చీడపురుగుల్ని సమాజం నుంచి ఏరివేయా లన్నారు. నాగరిక ఫరిడవిల్లక ముందే సమాజానికి పౌరసరఫరాల వ్యవస్థను పరిచయం చేసింది వైశ్యులు, ఓ ఆలయం నిర్మించాలన్నా, సత్రాన్ని నిర్వ హించాలన్నా ముందుకొచ్చి సాయం అందించేది వైశ్యులు అటువంటి వారిని స్మగ్లర్లుగా పోలుస్తూ పుస్తకాన్ని రచించిన ఐలయ్య ఎంతమాత్రం క్షమార్హుడు కాదన్నారు. ఇసుక నుంచి ఎర్రచందనం వరకు అక్రమ రవాణా చేస్తున్న వారు ఈ ప్రొఫెసర్‌కు సచ్చీలురుగా కనిపిస్తున్నారంటూ నిలదీశారు. కాశ్మీర్‌లో పండే కుంకుమపువ్వు నుంచి అడవిలో పండేకాయల వరకు ప్రతి ఒక్కరికి అందించేందుకు 24గంటలూ అందుబాటులో ఉండే వైశ్యులు అక్రమ వ్యాపారులా అంటూ ప్రశ్నించారు. సామాజిక వర్గాలపై ఆరోపణలతో ఆగని ఐలయ్య భారత రాజ్యాంగాన్నే సవాల్‌ చేసే విధంగా హిందూధర్మంపై విమర్శలకు దిగాడ న్నారు. హిందువులు ప్రత్యక్ష దైవాలుగా పూచించే వెంకటేశ్వరస్వామి, శ్రీరాముడుని సైతాన్లంటూ నడిరోడ్డుపై బహిరంగంగా ప్రకటిస్తే ఈ ప్రభుత్వాలు చేతులు ముడుచుకు కూర్చున్నాయన్నారు. హిందూ దేవుళ్ళను విమర్శిస్తే ఐలయ్య వంటివారికే కాదు.. వాటిని పట్టించుకోని ప్రభుత్వాలకు, పార్టీలకు కూడా పాపం అంటుతుందని పేర్కొన్నారు. హిందుత్వాన్ని విమర్శించేవారిని విడిచి హిందూ ధర్మపరిరక్షణ కోసం కృషి చేస్తున్న వారిని ఈ చట్టాలు జైల్లో పెడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి హిందుఇజాన్ని అవమాన పర్చిన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

శివానంద స్వామి మాట్లాడుతూ హిందుత్వాన్ని అవమానపర్చే వారిని దేశ సరిహద్దుల వరకు తరిమికొట్టాలన్నారు. హిందూదేవతల్ని గౌరవించని వారికి ఈ దేశంలో స్థానం లేదన్నారు. సామాజిక వర్గాల్ని కించపరుస్తూ కాదు.. చేతనైతే రిజర్వేషన్ల మీద పుస్తకం రాయి.. కాదంటే అధికారాన్ని అడ్డుపెట్టుకుని మీరు లక్ష కోట్లు తిన్నారంటూ.. మీరేం తక్కు వ మీరు మూడు లక్షల కోట్లు కాజేశారంటూ రాజకీయ పార్టీలు చేసే ఆరోపణలపై పుస్తకాలు రాయి.. అంటూ ఐలయ్యను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

శ్రీనివాసానంద స్వామి మాట్లాడుతూ రోడ్డుపై నడుస్తున్న ఏనుగుకు ఎలుక అడ్డొచ్చింది.. దాన్ని చూసిన ఏనుగు నడక ఆపి నిల్చుంది. దీంతో ఏనుగు నన్ను చూసి భయపడుతోందంటూ గంతులేయడం ప్రారంభించింది. అప్పుడు ఏనుగు నిన్ను చూసి భయపడి ఆగలేదు.. నా కాలికింద పడి పచ్చడైపోతావని నిల్చున్నానంటూ బదులిచ్చింది. ఇక్కడ ఏనుగు హిందుత్వమైతే ఎలుక ఐలయ్య వంటి వారంటూ స్వామిజీ చెప్పుకొచ్చారు. ఎన్ని ఎలుకలొచ్చినా ఏనుగును ఏమీ చేయలేవని, అలాగే ఎంతమంది ఐలయ్యలు పుట్టుకొచ్చినా హిందుత్వాన్ని అంతం చేయలేరన్నారు. ముస్లింలు మతం మీద దాడి చేశారు.. హిందుత్వం చెక్కుచెదరలేదు.. వారెళ్ళిపోయారు.. క్రైస్తవులొచ్చారు… కులంపై దాడి చేశారు.. అయినా ఏం సాధించలేకపోయారు.. ఇప్పుడు హిందుసమాజానికి చెంది డబ్బుకోసం ఏంచేసేందుకైనా వెనుకాడని ఐలయ్య వంటివారితో సామాజిక, మతపరమైన దాడికి మిషనరీలు పాల్పడుతున్నాయని విమర్శించారు. ఎవరెన్ని చేసినా హిందుత్వాన్ని దెబ్బతీయలేరని స్పష్టం చేశారు.ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటెశ్వరరావు మాట్లాడుతూ వేయి దేవతలకు నిలయంగా పూజించే గోమాతను వేయి ముక్కలు చేసుకుని తిన్నాం.. మాకేం కాలేదే అంటూ హిందూత్వంపై వ్యంగ్యాస్త్రాలు విసిరే ఐలయ్యలను క్షమించకూడదన్నారు. తల్లిదండ్రుల పేర్లు చెప్పుకునేందుకు కూడా ఇష్టపడని ఐలయ్య భారత సంతతికి చెందినవాడు కాదని, బ్రిటీష్‌ జాతీయుడని పేర్కొన్నారు. హిందుత్వంపై నడిరోడ్డుపై విమర్శలు చేసిన ఐలయ్య శిఖండిలా రాష్ట్రాన్ని పాలిస్తున్నావంటూ తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్‌ను దుర్భా షలాడినా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. ఐలయ్య ను శిక్షించే వరకు ఉద్యమం కొనసాగుతుందన్నారు. త్వరలోనే జాతీయ రహదార్లను దిగ్బంధిస్తామని అప్పటికీ చర్యల్లేకుంటే ఛలో విజయవాడ చేపడతామని హెచ్చరించారు. కరుణాకర్‌ సుగుణ మాట్లాడుతూ లక్ష కోట్లు ఇస్తే భారతదేశంలొని హిందువులందరి మతం మార్చేస్తానంటూ ఐలయ్య చేసిన వ్యాఖ్యల్ని తప్పుబట్టారు. హిందువులంతా డబ్బుల కోసం అమ్ముడుబోయే ఐలయ్యలు కాదన్నారు.

(ఆంధ్రభూమి సౌజన్యం తో)