Home News సంఘ కార్యక్రమాల్లో మహిళా అధ్యక్షురాలు

సంఘ కార్యక్రమాల్లో మహిళా అధ్యక్షురాలు

0
SHARE

– డాక్టర్ రాకేష్ సిన్హా

మహిళలు సార్వజనిక జీవితంలో తమ పాత్రను కోరుకుంటారు, అందుకే సంఘ శాఖల్లో, శిబిరాల్లో మహిళ నాయకులను వ్యాఖ్యానం కోసం ఆహ్వానించడం జరుగుతుండేది. సంఘపు సామాజిక సంస్కరణల దృక్పథానికి అఖిల భారతీయ మహిళా పరిషత్ తన సమర్థనను తెలియజేసింది. మహిళా పరిషత్ అధ్యక్షురాలుగా రాజ్ కుమారి అమృత్ కౌర్, రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి అనసూయ బాయి కాలేతోపాటు ఇతర సభ్యులు కూడా 1937 డిసెంబర్ 28న నాగపూర్ సంఘ శిబిరంలో పాల్గొన్నారు.

ఇలా జరగడం మొదటిసారి కాదు. దీనికి పూర్వం కూడా సామాజిక జీవనంలో సేవలను అందించే మహిళా నాయకురాళ్ళను, సామాజిక కార్యకర్తలను పలుమార్లు సంఘ కార్యక్రమాలకు ఆహ్వానించారు. కాంగ్రెస్ నాయకురాలు కమలాబాయి గారు 1938 నవంబర్ 21న కొంకణ్ లో జరిగిన సంఘ శాఖను సంబోధిస్తూ మాట్లాడారు. అలాగే పార్వతీ భాయ్ చిట్ని వాస్ 1934 డిసెంబర్ 9న నాగపూర్ లో జరిగిన సంఘ వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆ కార్యక్రమంలో సంఘ శ్రేయోభిలాషి, విధానసభ సభ్యురాలు రమాబాయి తాంబే కూడా ఉన్నారు.

పరమ పూజనీయ డాక్టర్ జీ మహిళల సామాజిక, రాజకీయ, సాంస్కృతిక చైతన్యం కోసం ఎంతగానో పరితపించేవారు. దాని ఫలితంగానే రాష్ట్ర సేవికాసమితి సృజన జరిగిందని చెప్పవచ్చు. సంఘం ద్వారా ప్రేరణ పొందిన మహిళా కార్యకర్తలు ఆత్మవిశ్వాసంతో, ధైర్యంతో ముందుకు కదిలి ఒక స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేయడానికి పునాది వేసినారని చెప్పవచ్చు.