Home News ముస్లిం దేశంలో 300 ఏళ్ల దేవాలయం.. రగులుతున్న అఖండ జ్వాల

ముస్లిం దేశంలో 300 ఏళ్ల దేవాలయం.. రగులుతున్న అఖండ జ్వాల

0
SHARE

అజర్‌ బైజాన్‌… ముస్లిం దేశం. కానీ ఏకంగా 95 శాతం మన హిందూ జనాభా వుంటుంది అక్కడ. ఈ దేశ రాజధాని బాకూలో మన హిందూ దేవాలయం వుంది. దీనిని దర్శించుకోవడానికి ఇరాన్‌ నుంచి కూడా ప్రజలు వస్తుంటారు. ఈ ఆలయాన్ని ‘‘జ్వాలా మందిర్‌, అతేష్‌గాహ’’ అని పిలుస్తుంటారు. జ్వాలా మందిర్‌ అని ఎందుకు పిలుస్తారంటే… ఈ ఆలయంలో కొన్ని సంవత్సరాలుగా జ్వాల వెలుగుతూనే వుంది. అందుకే దీనిని ‘‘టెంపుల్‌ ఆఫ్‌ ఫైర్‌’’ అని పిలుస్తుంటారు. ఈ ఆలయాన్ని బయట నుంచి చూస్తుంటే… పురాతన కోట లాగా కనిపిస్తుంది.కానీ.. దీని పై కప్పు మాత్రం హిందూ దేవాలయాన్నే పోలి వుంటుంది. దానిపై త్రిశూలం కూడా వుంటుంది.

ఈ ఆలయ చరిత్ర 300 సంవత్సరాల పురాతనమని చెబుతుంటారు. 18 వ శతాబ్దంలో దీనిని నిర్మించారు. హిందువులు దీనిని దుర్గామాతకి సంబంధించిన పవిత్ర ఆలయంగా భావిస్తుంటారు. ఏప్రిల్‌ 2018 లో అప్పటి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ మూడురోజుల పాటు అజర్‌ బైజాన్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఈ ఆలయాన్ని దర్శించుకున్నారు. అయితే విచిత్రమేమిటంటే.. ఈ ఆలయంలో ఏ దేవతా విగ్రహం కూడా కనిపించదు. కానీ.. అఖండంగా ఓ జ్వాల మాత్రం వెలుగుతూనే వుంటుంది. దీనినే ఆరాధిస్తుంటారు భక్తులు. ఇది తమకి సంబంధించిన ఆలయమని పార్శీలు బలంగా నమ్ముంటారు. కానీ.. చారిత్ర ఆధారాల ప్రకారం ఇది హిందువులదే అని చరిత్రకారులు స్పష్టం చేసేశారు. ఇక్కడ అర్చకులు గతంలో ప్రతి రోజూ పూజలు చేసేవారని పేర్కొన్నారు.

ఒక.. కొన్ని మీడియా నివేదికల ప్రకారం మాత్రం.. వందల సంవత్సరాల క్రితం భారతీయ వ్యాపారులు ఈ మార్గంలో ప్రయాణించేవారని, వారే ఈ ఆలయాన్ని నిర్మించారని చెబుతుంటారు.అయితే… మరికొందరి చరిత్రకారుల ప్రకారం దీనిని హర్యానాలోని కురుక్షేత్ర వాసి అయిన బుద్ధదేవ్‌ నిర్మించారని చెబుతున్నారు.