భారత్–అమెరికా సంబంధాలు ద్వైపాక్షిక అంశాల ప్రాతిపదికగానే ఏర్పడ్డాయి. రిపబ్లికన్ పార్టీకే చెందిన నిక్సన్‌తో మన దౌత్య సంబంధాలు సజావుగా సాగలేదు. అయితే అదే పార్టీకి చెందిన బుష్ అధ్యక్ష పదవీ కాలంలో ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు కొనసా గాయి. డెమోక్రటిక్ పార్టీకి చెందిన అధ్యక్షులు జిమ్మీ కార్టర్, బిల్ క్లింటన్ల హయాంలలో కొన్ని ఒడిదుడుకులు చోటు చేసుకున్నాయి. కానీ డెమోక్రటిక్ పార్టీ నుంచే ఎంపికైన ఒబామా కాలంలో మంచి సంబంధాలు నెలకొన్నాయి.
ఇవాళ భారతదేశంలో ఎక్కడ విన్నా అమెరికా అధ్యక్ష ఎన్నికల గురించిన మాటే వినిపిస్తోంది. ఆ అగ్రరాజ్య అధ్యక్ష పీఠాన్ని తరువాత ఎవరు అధి రోహించాలన్న అంశం మీద అటు సోషల్ మీడియాలోనూ, ఇటు ప్రధాన స్రవంతి మీడియాలోనూ కూడా చాలా మంది తమ తమ అభిప్రాయాలను ఎంతో బలంగా, ఎలాంటి శషభిషలు లేకుండా వినిపిస్తున్నారు. హిల్లరీ క్లింటన్ గెలిస్తే లేదా డొనాల్డ్ ట్రంప్ గెలిస్తే భారతదేశానికి జరిగే ప్రయో జనాలు, వాటి పూర్వాపరాల గురించి అభిప్రాయాలనీ, వాదనలనీ ఇక్కడ నుంచే స్ఫుటంగా వినిపిస్తున్నవాళ్లలో ఏ ఒక్కరికి అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ఓటు వేసే అవకాశమైతే లేదు. అయినా మనవాళ్లు తమ అభిప్రాయాలను వ్యక్తీకరిస్తున్నారు. అంటే అమెరికా సంయుక్త రాష్ట్రాల వ్యవహారాలతో మనం ఎంతగా మమేకమైనామో ఇదే చెప్పక చెబుతోంది.
యూరోపియన్ యూనియన్‌లో బ్రిటన్ కొనసాగాలా వద్దా అనే అంశం (బ్రిగ్జిట్), లేదా ఆ తరువాత (నాటి) బ్రిటిష్ ప్రధాని డేవిడ్ కామెరూన్ రాజ కీయ భవితవ్యం ఏ మలుపు తిరిగింది వంటి అంశాలేవీ మనలని అంతగా కదిలించలేదు. తరువాత జరిగిన పరిణామాలలో భాగంగా £ð రిసా మే అనే ఒక మహిళా నేత కామెరూన్ వారసురాలిగా ఆ దేశ ప్రధాని పదవికి ఎంపిక వుతారని గాని, అలాంటి పేరు కలిగిన ఒక మహిళా రాజకీయవేత్త ఆ దేశంలో ఉన్న సంగతి కానీ మనలో అత్యధికులకు తెలియనే తెలియదు.
పాక్ పరిణామాలను గమనించవలసిందే
అయితే పాకిస్తాన్ పరిణామాలను మాత్రం మనం కచ్చితంగా గమ నిస్తాం. తనకంటే ముందు పనిచేసిన వారిలాగే జనరల్ రాహిల్ షరీఫ్ కొన్ని వారాల తరువాత నవంబర్ 29 నాటికి రావల్పిండి వెళతారా? సైనిక దుస్తులలోని షరీఫ్‌కీ, పౌర ప్రతినిధి షరీఫ్‌కీ మధ్య మరో ఘర్షణను ఆ దేశం చూడక తప్పదా? వంటి విషయాలను మనం ఆసక్తిగానే గమనిస్తాం. పాకి స్తాన్‌కు చెందిన ప్రముఖ వార్తాపత్రిక ‘డాన్’లో సిరిల్ అల్మేడియా రాసిన కథనం చూసినవారికి ఎవరికైనా అక్కడ పౌర, సైనిక వ్యవస్థల మధ్య సంబం ధాలు సాఫీగా లేవన్న సంగతి అర్థమవుతుంది. ఈ వార్తా కథనం మీద రాహిల్ షరీఫ్ సహా, పాకిస్తాన్ ఉన్నత సైనికాధికారులు మండిపడుతున్నారు. ఇలాంటి కథనం వెలువడడానికి పౌర నేతలే కారణమంటూ రాహిల్ ధ్వజమె త్తారు. ఇది జాతీయ భద్రతకు భంగకరమని కూడా ఆయన ఆరోపిస్తున్నారు. ఇంకో అడుగు ముందుకు వేసి రాహిల్, ఆ కథనం ఒక ముఖ్యమైన రక్షణ వ్యవహారాల సమావేశం గురించి కట్టుకథ అల్లి లీక్ చేశారని మండిపడ్డారు.
ఇంతకీ ‘డాన్’ ప్రచురించిన ఆ కథనం ఏమిటి? జీహాదీ సంస్థల మీద ఎలాంటి చర్య తీసుకోవాలి అనే అంశాన్ని చర్చించడానికి ఏర్పాటు చేసిన జాతీయ భద్రతా మండలి (ఎన్ఎస్సీ) సమావేశంలో పౌర, సైనిక అధికారుల మధ్య వచ్చిన చీలిక గురించి వివరించిన వార్తా కథనమది. అయితే ఈ కథ నాన్ని జనరల్ రాహిల్ లీక్ చేయించి, పౌర ప్రభుత్వాన్ని బెదిరించడానికి ఉపయోగించుకున్నాడు. ఆ వార్త కథనం వెలువడిన ఒక నెల తరువాత లీక్ గురించి దర్యాప్తు ఎంత వరకు సాగిందో వివరించడానికి పాకిస్తాన్ ముస్లిం లీగ్ (నవాజ్)కు చెందిన సీనియర్ నేతలు కొందరు ఇటీవల జనరల్ గారి భవంతికి ఉరుకులు పరుగులు మీద వెళ్లడమే అందుకు ప్రబల నిదర్శనం. జనరల్ భవంతికి వచ్చిన సీనియర్ నేతల బృందంలో దేశీయ వ్యవహారాల కేంద్ర మంత్రి చౌదరి నిసార్ అలీ ఖాన్, ఆర్థిక మంత్రి ఇషాక్ దార్, పంజాబ్ ముఖ్యమంత్రి షెహాబాజ్ షరీఫ్ ఉన్నారనీ, బృందం పేరు కొయాస్ అని సైనికాధికారులు విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు కూడా. అల్మేడియా కథనం ప్రకారం ఎన్ఎస్సీ సమావేశంలో పంజాబ్ ముఖ్యమంత్రి సైనికాధికారుల మీద మండిపడినట్టు చెప్పడం మరొక విశేషం.
చైనా నాయకుడు జిన్‌పింగ్‌కు ‘కోర్ లీడర్’ స్థానం కల్పించడంతో మన ం జాగరూకులం కావాలి. చైనా కమ్యూనిస్టు పార్టీ ఆయనకు ఈ వారారంభంలో కోర్ లీడర్ (ఎంతో క్రియాశీలకమైన, ముఖ్యమైన నాయకుడు) హోదా ఇచ్చింది. పార్టీ కేంద్ర కమిటీ నాలుగు రోజుల పాటు చర్చలు జరిపిన తరు వాత ఈ మేరకు పార్టీ నాయకులు పెద్ద ప్రకటన ఇచ్చారు. పార్టీ సభ్యులంతా ఐక్యంగా ఉండి, జిన్‌పింగ్ కీలకనేతగా పనిచేస్తారని ఆ ప్రకటన వెల్లడించింది.
చైనాలో ‘కోర్’ నేత
ప్రతి ఐదేళ్లకు ఒకసారి పార్టీ కీలక కాంగ్రెస్ జరుగుతుంది. కొద్ది మాసాలలోనే ఆ కాంగ్రెస్ జరగనుండగా ఇలా ‘కోర్’ నేత హోదా కల్పించడం అంటే పార్టీలో, ప్రభుత్వంలో జిన్‌పింగ్‌కు ఉన్న పట్టు మరింత పటిష్టమవు తుంది. ఈ పదబంధాన్ని సృష్టించినవారు డెంగ్. ఆయనే మావో, జియాంగ్ జెమిన్ కోర్ నేతలేనని వ్యాఖ్యానించారు. దీనర్థం– వారు నిరపేక్షాధికారం కలిగిన వారు. వారిని ప్రశ్నించడానికి వీలు లేదు. ఇప్పుడు జిన్‌పింగ్ కూడా అలాంటి అత్యున్నతాధికారాలు కలిగిన నాయక శ్రేణిలో చేరుతున్నారు. మావో, డెంగ్‌ల మాదిరిగానే కోర్ హోదా దక్కించుకున్న జిన్‌పింగ్ అడుగులు ఎటు పడతా యన్న అంశాన్ని, ఆపై పరిణామాలు ఎలా ఉండబోతున్నాయన్న అంశాన్ని మనం జాగరూకతతో గమనించవలసిందే.
చైనా వ్యవహారాలతో పాటే శ్రీలంకలో చోటు చేసుకుంటున్న పరిణా మాలను కూడా భారత్ చర్చించవలసి ఉంది. ఇటీవలి కాలంలో శ్రీలంక క్రమంగా చైనా వైపు మొగ్గుతున్నట్టు ఉంది. అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు దరిమిలా దక్షిణ చైనా సాగరం విషయంలో శ్రీలంక తనకు మద్దతు ఇచ్చిందని చైనాయే ప్రకటించుకుంది. అయితే తాను దక్షిణ చైనా సాగరంలో ఇతరుల జోక్యాన్ని కోరడం లేదంటూ తరువాత శ్రీలంక చేత వివరణ ఇప్పించవలసి వచ్చింది.
చైనా నుంచి అందిన 20 బిలియన్ అమెరికా డాలర్ల నిధితో బంగ్లాదేశ్ నాయకత్వం భవిష్యత్తులో ఎలా వ్యవహరించబోతోంది. అలాగే నేపాల్‌లో మౌలిక వసతుల కల్పనకు చైనా ఎంతో విస్తారంగా సాయం చేస్తోంది. ఈ అంశం నేపాల్‌తో మన ద్వైపాక్షిక సంబంధాలను ఎలా ప్రభావితం చేయబో తున్నది? భూటాన్‌కూ, చైనాకూ మధ్య గడచిన మూడు దశాబ్దాలలో 54 పర్యాయాలు భారత్ ప్రమేయం లేకుండా చర్చలు జరిగాయి. విదేశ వ్యవహా రాలకు సంబంధించి భూటాన్ భారత్ మీద ఆధారపడడం మానేసింది. ఈ అంశాలన్నీ భారతీయులంతా తీవ్రంగా ఆలోచించవలసిన విషయాలే.
అయినా అమెరికా వ్యవహారాలు మనకు చాలా ప్రాధాన్యం ఉన్న అంశా లవుతున్నాయి. ఒక దశ వరకు ఈ ఆసక్తి ఆ దేశంతో మన సంబంధాల ప్రాధా న్యాన్ని వ్యక్తం చేస్తోందని చెప్పాలి. అంతకు మించి ఆ దేశ ప్రజలతో, సంస్థ లతో అక్కడ ఉన్న 35 లక్షల మంది భారతీయుల బంధాన్ని కూడా వ్యక్తం చేస్తోంది. అక్కడి భారతీయులు అమెరికా రాజకీయాలలో కీలక పాత్ర పోషిం చడం ఆరంభించారు. మొదట్లో ప్రధాన పార్టీల అధ్యక్ష అభ్యర్థులకు నిధులు అందించడానికే మనవాళ్లు పరిమితమయ్యేవారు. అయితే ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు అమెరికా ప్రజలలో వచ్చిన రాజకీయ పరమైన వైరుధ్యంలో భారతీయులు రెండు శిబిరాలలోను కీలకంగా మారారు. షాలభ్కుమార్ ట్రంప్ శిబిరంలో పనిచేస్తుంటే, నీరా టాండన్ హిల్లరీ వెంట ఉన్నారు.
భారత్‌తో పటిష్ట సంబంధమే కొనసాగుతుంది
ప్రస్తుత ఎన్నికలలో విజయం రెండు ప్రధాన పార్టీలు పోటా పోటీగా ఉన్న పెన్సిల్వేనియా, దక్షిణ కెరోలినా వంటి రాష్ట్రాల నిర్ణయం మీద ఆధార పడి ఉంది. అమెరికా ప్రవాస భారతీయులు రెండు శిబిరాలలోను సమంగానే ఉన్నారు. నిజానికి భారత్–అమెరికా సంబంధాలు ద్వైపాక్షిక అంశాల ప్రాతి పదికగానే సాగాయి. రిపబ్లికన్ పార్టీకే చెందిన నిక్సన్‌తో మన దౌత్య సంబం ధాలు సజావుగా సాగలేదు. అయితే అదే పార్టీకి చెందిన బుష్ అధ్యక్ష పదవీ కాలంలో ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగాయి. డెమోక్రటిక్ పార్టీకి చెందిన అధ్యక్షులు జిమ్మీ కార్టర్, బిల్ క్లింటన్ల హయాంలలో కొన్ని ఒడిదుడుకులు చోటు చేసుకున్నాయి. కానీ డెమోక్రటిక్ పార్టీ నుంచే ఎంపికైన ఒబామా కాలంలో మంచి సంబంధాలు నెలకొన్నాయి.
భారత్ శక్తిని పెంచుకుంది. ప్రాధాన్యాన్ని పెంచుకుంది. ఆత్మ విశ్వా సాన్ని పెంచుకోగలిగింది. ఈ నేపథ్యంలో తరువాతి అమెరికా అధ్యక్ష పీఠాన్ని ఎవరు అలంకరిస్తారన్న అంశం మీద కలత పడవలసిన అవసరం కనిపిం చదు. ఈ రెండు దేశాల బంధాలు అంత దృఢంగా ఉన్నాయి. ఇప్పుడు ఎవరు అధ్యక్షులైనా ఆ బంధాన్ని మరింత పటిష్టం చేయవలసిందే.
మున్నెన్నడూ లేని రీతిలో అమెరికా అధ్యక్ష ఎన్నికల మీద భారతీయులు ఆసక్తి పెంచుకోవడం మీద నేర్చుకోగలిగిన అంశం ఏదైనా ఉందా అంటే, అది ట్రాక్ 2 దౌత్యం (ప్రభుత్వ ప్రమేయం లేకుండా సంస్థలు, ప్రజల మధ్య ఏర్పడే సంబంధాలు) అవసరం గురించే. ఇది మన అవసరాలను నెరవేర్చ డంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఒక సందర్భంలో మన ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్టు భారత నేతలు ఢాకా లేదా కొలంబో వెళ్లాలి. మధ్యాహ్నం ఆ దేశాల నేతలతో తేనీరు స్వీకరించి మళ్లీ సాయంత్రానికి ఢిల్లీ చేరుకోవాలి. దేశ ప్రయోజనాల కోసం ఇంత సులభమైన రాకపోకలను వివిధ స్థాయిలలో ప్రోత్సహించాలి.
వ్యాసకర్త : రామ్‌మాధవ్ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
ఈ–మెయిల్ : [email protected]
(సాక్షి సౌజన్యం తో)