Home Uncategorized పాకిస్థాన్‌కు విన్నపాలా?!

పాకిస్థాన్‌కు విన్నపాలా?!

0
SHARE

మతం పేరిట ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడడం, జిహాద్‌ పేరిట మతోన్మాదాన్ని పురిగొల్పడం వల్ల మతపరమైన మనుగడలో హింసాకాండ అనివార్య భాగమని సామాన్య ముస్లింలు విశ్వసించక తప్పనిపరిస్థితి ఏర్పడింది. మతం పేరిట ఉగ్రవాద కార్యకలా పాలను ప్రోత్సహించడాన్ని మానుకోవాలని పాకిస్థాన్‌కు పదే పదే చేస్తున్న విజ్ఞప్తులు సత్ఫలితాలనిస్తాయా?

పొరుగువాడికి అపకారం చేయడం దుష్ట స్వభావం అయితే పాకిస్థాన్‌ నిస్సందేహంగా ఒక దుష్ట రాజ్యం. సర్జికల్‌ దాడులు సైతం ఆ దేశ దుష్ట నైజాన్ని మార్చలేకపోతున్నాయి. భారత్‌ను మరింతగా రక్తమోడేలా చేసి కశ్మీర్‌ను పూర్తిగా స్వాయత్తం చేసుకోవాలన్న ఆకాంక్షను పాక్‌ పాలకులు విడనాడడం లేదు. భారత్‌కు వ్యతిరేకంగా కుట్రలు చేస్తూనే వున్నారు.

 కశ్మీర్‌లో కొనసాగుతున్న ఉగ్రవాద దాడులు, భారత్ తీరప్రాంత రక్షణ దళం గుజరాత్ తీరంలో పట్టుకున్న పాకిస్థానీ నావలు, కేరళ అడవులలో ఇస్లామిక్‌ స్టేట్‌ నిర్వహిస్తున్న సాయుధ శిక్షణా శిబిరాలు మొదలైనవన్నీ పాక్‌ భూభాగాల నుంచి భారత్ కు వ్యతిరేకంగా కొనసాగుతోన్న మంద్ర స్థాయి యుద్ధానికి నిదర్శనాలు. దీపావళి వేడుకల సందర్భంగా కొంత మంది వీఐపీలను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాద దాడులు జరిపేందుకు కేరళ అడవులలో ఇస్లామిక్‌స్టేట్‌ శిక్షణా శిబిరాలను నిర్వహిస్తున్నట్టు ఉగ్రవాద వ్యతిరేక భద్రతా సంస్థ ‘నేషనల్‌ ఇన్వెస్టిగేటివ్‌ ఏజెన్సీ’ (ఎన్‌ఐఏ) కనుగొన్నది. ముస్లిం జనాభా అత్యధికంగా ఉండే కన్నూర్‌ జిల్లాలోని అడవులలో ఈ శిబిరాలను కనుగొన్నారు. ఇస్లామిక్‌ స్టేట్‌ కేరళ విభాగంగా పనిచేస్తున్న అన్వరుల్‌ ఖలీఫా సంస్థ పన్నెండు మంది యువకులకు ఉగ్రవాద దాడులలో శిక్షణనిస్తున్నట్టు ఎన్‌ఐఏ అధికారులు వెల్లడించారు. ఈ అధికారులు సాహసోపేతంగా ఆ శిబిరాలలోకి చొరబడి ఇస్లామిక్‌ మిలిటెంట్ల కుట్రను విచ్ఛిన్నం చేశారు.

ఇటీవల ఫ్రాన్స్‌లోని నైస్‌ నగరంలో ఫ్రెంచ్‌ ఇస్లామిక్‌ స్టేట్‌ బృందం వారు నిర్వహించిన ఉగ్రవాద దాడి తరహా రాక్షస దాడులను భారత్‌లో జరపడానికి అన్వరుల్‌ ఖలీఫా వారు పన్నాగం పన్నారు. నైస్‌లో ఒక ట్రక్కు నిండా పేలుడు పదార్థాలను నింపుకుని, దాన్ని జనసమ్మర్థ ప్రాంతంలోకి తీసుకెళ్ళి పేల్చివేసిన దురాగతం గురించి విదితమే. మన దేశంలో కూడా అటువంటి ముష్కర చర్యకు పాల్పడేందుకు అన్వరుల్‌ ఖలీఫా సన్నద్ధమవుతోన్నది. ఇందులో భాగంగానే భారత వ్యతిరేక కరపత్రాలు, వీడియోలను కేరళ, తమిళనాడులోని ముస్లింలకు పంపిణీ చేశారు.

కేరళ అడవులలో ఉగ్రవాదుల శిక్షణా శిబిరం గురించి స్థానిక పోలీసులకు తెలియకపోవడం ఆశ్చర్యమే. లేదా తెలిసినా తెలియనట్టు వ్యవహరించి వుండవచ్చు. ఇది గమనార్హమైన విషయం. ఎందుకంటే కేరళలో గత పదే ళ్ళలో ఇటువంటి శిక్షణా శిబిరాన్ని నిర్వహించడం ఇది రెండవసారి. 2008లో నిర్వహించిన మొదటి శిబిరాన్ని కనుగొనలేకపోయారు. అయితే ఆ శిక్షణా శిబిరం గురించి తమ వద్ద సమాచారమున్నదని, దాని పర్యవసానాల తీవ్రతను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని మీడియాకు పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ విషయమై మీడియా పూర్తిస్థాయిలో ఆసక్తి చూపిన తరువాతనే ఆ శిబిరం వ్యవహారాలు ప్రజల దృష్టికి వచ్చాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం మేల్కోక తప్పలేదు. కొంతమందిని అరెస్ట్‌ చేయడానికి చర్యలు తీసుకున్నారు గానీ అవి ఎటువంటి ఫలితాలనివ్వలేదు.

అన్వరుల్‌ ఖలీఫా బృందంలోకి ఎన్‌ఐఏ ఏజెంట్లు చొరబడిన ఫలితంగా రెండో శిక్షణా శిబిరం గురించి తెలిసివచ్చింది. పెద్ద ఎత్తున ప్రచార సాహిత్యం, మారణాయుధాలు, బాంబులు, ఇతర ఆయుధాలకు సంబంధించిన సాక్ష్యాధారాలు కూడా లభించాయి. పేలుడు సామాగ్రితో వున్న ట్రక్కులను జనసమ్మర్థ ప్రాంతాలలోకి తీసుకువెళ్ళి పేల్చివేయడానికి పన్నిన కుట్రను ఎన్‌ఐఏ అధికారులు సకాలంలో కనుగొని ఒక పెద్ద దుర్ఘటనను నివారించారు. ఒక పథకం ప్రకారం ముస్లిం యువకులతో వివాహం పేరిట తమ కుమార్తెలను అపహరించి ఇస్లాంకు మార్చి, సిరియాకు వెళ్ళేలా వాళ్ళలో మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్నారని కేరళలో పలు ముస్లిమేతర కుటుంబాలు చాలాకాలంగా గగ్గోలు పెడుతున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం రెండు నెలల క్రితం మాత్రమే ఈ ఫిర్యాదులను సీరియ్‌సగా తీసుకోవడం ప్రారంభించింది. దాదాపు రెండు డజన్లమంది కేరళ యువతీయువకులు ఇస్లామిక్‌ స్టేట్‌లో చేరడానికి గాను తప్పుడు పాస్‌పోర్ట్‌లు, వీసాలతో సిరియాకు వెళ్ళడం జరిగింది.

ఇస్లామిక్‌ స్టేట్‌ ప్రభావంలోకి వెళ్ళిన ముస్లిం సీ్త్రపురుషులు పశువుల స్థాయికి దిగజారిపోతున్నారనడంలో సందేహం లేదు. ఈ విషయమై ప్రపంచవ్యాప్తంగా (పాకిస్థాన్‌ మినహా) వార్తాపత్రికలు పలు కథనాలను ప్రచురిస్తున్నాయి. ఇస్లామిక్‌ స్టేట్‌ ఇటీవల ప్రచారంలో పెట్టిన ఒక వీడి యోలో ఒక జిహాదీ మహిళ తనపై వారు జారీ చేసిన ఆదేశాల ప్రకారం ఒక వ్యక్తి తలను నరికి వేయడమే కాకుండా, తన సహచరులు చూస్తుండగా ఆ హతుని తలను ‘వండడాన్ని’ సైతం చూపించారు.

నైస్‌ నగరంలో ఉగ్రవాద దురాగాతానికి పాల్పడ్డ జిహాదీ కొత్తగా ఇస్లాం మతంలో చేరిన వ్యక్తి. ముస్లిమేతరులందరినీ హతమార్చాలని ఇస్లామిక్‌ స్టేట్‌ ప్రచార సాహిత్యం ప్రబోధిస్తున్నది. ఆ ప్రచారానికి ప్రభావితులైన జిహాదీలు అమానుషమైన దురాగతాలకు పాల్పడుతున్నారు.

ఇస్లాం ఆవిర్భవించడానికి పూర్వపు చారిత్రక వారసత్వ కట్టడాలన్నిటినీ పూర్తిగా నిర్మూలించాలని ఇస్లామిక్‌ స్టేట్‌ తన అనుయాయులకు పిలుపునిచ్చింది. అఫ్ఘానిస్తాన్‌, తాలిబన్ల పాలనలో ఉన్నప్పుడు ఆ దేశంలోని చరిత్రా త్మక బౌద్ధ శిల్పాలను పూర్తిగా కూల్చివేసిన విషయాన్ని ప్రపంచం ఇంకా విస్మరించలేదు. మధ్య ఆసియా నుంచి మన దేశంపై దురాక్రమించినవారు తమ శతాబ్దాల పాలనలో ఎన్నో ప్రాచీన ఆలయాలు, ఇతర చరిత్రాత్మక కట్టడాలను పూర్తిగా శిథిలం చేశారు. ఎంతో పవిత్రమైన మథుర, కాశీ, అయోధ్య, సోమనాథ్‌ ఆలయాలు ఆ దుర్రాకమణదారుల వినాశకచర్యలకు గురైనవే.

ఇప్పుడు జిహాదీలలో ఒక వర్గం వారు ప్రపంచవ్యాప్తంగా తమతో ఏకీ భవించని వారిని ఇస్లాంలోకి మార్చి వేయాలని లేదా పూర్తిగా నిర్మూలిం చాలని కృత నిశ్చయంతో వున్నారనేందుకు గట్టి రుజువులున్నాయి. పాకిస్థాన్‌లో తమకు భిన్నమైన వర్గాలకు చెందిన ముస్లింలను కూడా వారు క్షమించడం లేదు. వారిపై పెద్ద ఎత్తున దాడులు జరపడమే గాక ఆ వర్గం వారి మసీదులు, ఇతర కట్టడాలను ధ్వంసం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితు లలో ఉగ్రవాద కార్యకలాపాలకు ఎటువంటి మద్దతు ఇవ్వకూడదని పాకిస్థాన్‌కు పదే పదే విజ్ఞపి చేయడం వల్ల ప్రయోజనమేముంది? మతం పేరిట ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడడం, జిహాద్‌ పేరిట మతోన్మాదాన్ని పురిగొల్పడం వల్ల మతపరమైన మనుగడలో హింసాకాండ అనివార్య భాగమని సామాన్య ముస్లింలు విశ్వసించక తప్పని పరిస్థితి ఏర్పడింది. తన మతాన్ని ప్రపంచవ్యాప్తం చేస్తోన్న జిహాదీలకు ఆధారంగా ఉండడానికి పాకిస్థాన్‌ సంతోషిస్తుంది.

మతం పేరిట ఉగ్రవాద కార్యకలా పాలను ప్రోత్సహించడాన్ని మానుకోవాలని పాకిస్థాన్‌కు పదే పదే చేస్తున్న విజ్ఞప్తులు సత్ఫలితాలనిస్తాయా అన్న విషయాన్ని అంతర్జాతీయ సమాజం సమీక్షించుకోవాల్సిన సమయమాసన్నమయింది. పాక్‌లో గత మూడు దశాబ్దాలుగా మతాచార్యులు-సైనికాధికారుల ఆధ్వర్యంలో మదరసాల ద్వారా ప్రజలకు వహాబీ ఇస్లామిక్‌ పాఠాలను నూరిపోశారు. తత్ఫలితంగానే ఇప్పుడు తాము అనుసరించే ఇస్లాం ప్రపంచవ్యాప్తం కావడంలోనే తమ భవిష్యత్తు ఉన్నదని పాకిస్థాన్‌ ప్రజలలో అత్యధికులు విశ్వసిస్తున్నారు. 1930వ దశకంలో యూరో్‌పలో శాంతి స్థాపనకు బ్రిటిష్‌ ప్రధాని చాంబర్లైన్‌ చేసిన ప్రయత్నాలను జర్మనీ నాజీ పాలకులు ఎంత ఏవగింపుగా చూశారో ఇప్పుడు శాంతిసామరస్యాల సాధనకు అంతర్జాతీయ సమాజం చేసే ప్రయత్నాలను కూడా పాకిస్థాన్‌ అలాగే తృణీకార భావనతో చూస్తుందనడంలో సందేహం లేదు.

– బల్బీర్ పుంజ్

(బీజేపీ సీనియర్‌ నాయకులు)