Home News సమాచార వాహిని: 24-నవంబర్-2018 (వార్తా పత్రికలలోని ముఖ్యమైన సమాచారం)

సమాచార వాహిని: 24-నవంబర్-2018 (వార్తా పత్రికలలోని ముఖ్యమైన సమాచారం)

0
SHARE
AYODHYA, INDIA - DECEMBER 6: Hindu saints and devotees are seen near the mosque in Ayodhya, during a demonstration under watchful eye of the police, 06 December 1992. AFP PHOTO DOUGLAS E CURRAN (Photo credit should read DOUGLAS E CURRAN/AFP/Getty Images)

విచ్ఛిన్నకర శక్తులకు విపక్షనేతల మద్దతు!

దేశానికి యుద్ధం బెడద వచ్చినపుడు సరిహద్దుల్లో శత్రుసేనలను తరిమికొట్టి ‘భారతమాతాకీ జై’ అని మన జవాన్లు నినదిస్తారు. అసదుద్దీన్ ఒవైసీ లాంటి వాళ్ళు మాత్రం ‘భారత్ మాతాకీ జై’ అనాలని రాజ్యాంగంలో వుందా? అని ప్రశ్నిస్తారు. జవాన్ల కంటే ఒవైసీ మొనగాడా? రజాకార్ల పార్టీని కొనసాగిస్తున్న ఒవైసీ గతంలో రజాకార్లు తెలంగాణలో చేసిన అరాజకాలకు క్షమాపణ ఎందుకు చెప్పరు?  Read More..


అయోధ్యలో టెన్షన్‌ టెన్షన్‌144 సెక్షన్‌ విధింపు

అయోధ్య: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిర నిర్మాణం చేపట్టాలన్న డిమాండ్‌తో విశ్వహిందూ పరిషత్‌, శివసేన ధర్మసభలకు పిలుపునివ్వడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ధర్మసభ పేరుతో విశ్వహిందూ పరిషత్‌ ఆదివారం భారీ కార్యక్రమం చేపట్టేందుకు సిద్ధమైంది. మరోవైపు శివసేన అధినేత ఉద్ధవ్‌ థాకరే కూడా నేడు అయోధ్యకు బయల్దేరారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు అయోధ్యలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. వందల మంది పోలీసులు మోహరించారు. ఈ ప్రాంతంలో 144 సెక్షన్‌ విధించారు. Read More..  


రామమందిర నిర్మాణాన్ని ప్రజలే మొదలుపెడతారు: బాబా రాందేవ్హరిద్వార్: ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణ విషయంలో ప్రజల్లో సహనం నశించిందని వ్యాఖ్యానించారు. హరిద్వార్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. రామ మందిరం కోసం త్వరగా చట్టం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. లేదంటే ప్రజలే రామ మందిర నిర్మాణం ప్రారంభిస్తారన్నారు. Read More..  


Uddhav Thackeray, family arrive in Ayodhya

Shiv Sena president Uddhav Thackeray, accompanied by wife Rashmi and son Aditya, arrived here on Saturday. Upon his arrival, he was greeted by senior Shiv Sena cadres and other officials to the slogans of ‘Jai Sri Ram’. Read More..