- జనజాతి సురక్ష మంచ్ ఆధ్వర్యంలో గిరిజనుల డిమాండ్
- పాడేరు పట్టణంలో హిందూ ధార్మిక సభ్యులు, వేలాది మంది గిరిజన ప్రజలతో మహార్యాలీ
మతం మారిన గిరిజనులను ఎస్టీ జాబితాలో తొలగించాలని, వారికి రిజర్వేషన్లు వర్తింపజేయవద్దని గిరిజనులు డిమాండ్ చేశారు. జనజాతి సురక్ష మంచ్ ఆధ్వర్యంలో ఆదివారం పాడేరు పట్టణంలో హిందూ ధార్మిక సభ్యులు, వేలాది మంది గిరిజన ప్రజలతో మహార్యాలీ నిర్వహించారు. తలార్సింగి గౌతమి పాఠశాల నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్, సినిమాహాల్ సెంటర్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సుండ్రుపుట్టు, మెయిన్ బజార్, పాత బస్టాండ్ మీదుగా ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు “మతం మారిన గిరిజనులను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని, గిరిజన సాంస్కృతిని పరిరక్షణ చేసుకోవాలని, విదేశీ సాంస్కృతి వద్దు స్వదేశీ సాంస్కృతి ముద్దు, మతమార్పిడిని అరికట్టండి, ధర్మసాంస్కతిని రక్షించండి, క్రైస్తవులా మారాకా గిరిజనులు ఎలా అవుతారు, అంటూ పెద్దఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జనజాతి సురక్షా మంచ్ జాతీయ ప్రతినిధి హెచ్.కె. నాగు మాట్లాడుతూ మతం మారిన గిరిజనులను ఎస్టీల జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబూరావు మాట్లాడుతూ…. జీఓ నం3ని పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. ఇది చాలక ఆంధ్రప్రదేశ్ వైకాపా, తెదేపాలు కలిసి బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు విఫలయత్నం చేయడం ఆందోళన కలిగించే అంశంగా మారిందన్నారు. గతంలో తెదేపా ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానించి పార్లమెంట్‌కు పంపితే కేంద్ర ప్రభుత్వం వెనక్కి పంపిందన్నారు. ఇప్పుడు వైసీపీ మరోసారి తీర్మానం చేసి పంపితే గిరిజనులంతా ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు.. మతం మారిన గిరిజనులంతా తిరిగి స్వధర్మంలోకి రావాలని ఆయన కోరారు. లేదంటే వారి ధ్రువపత్రాల్లో కూడా మతాన్ని మార్చుకోవాలని డిమాండు చేశారు. ఇతర రాజకీయ పార్టీలు సైతం మతం మారిన గిరిజనుల పట్ల ఇదే వైఖరి అవలంభించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో కూడా పెద్ద సంఖ్యలో మతమార్పిడులు జరిగాయి. ఆ కారణంగా నిజమైన గిరిజనులు పలు సౌకర్యాలను కోల్పోతున్నారు. క్రైస్తవ మతంలోకి మారిన కారణంగా షెడ్యూల్ కులాల రిజర్వేషన్ తో ఎన్నికైన ఒక శాసనసభ్యుడుని ఇటీవలే కేరళ హైకోర్టు అనర్హుడిగా ప్రకటించింది. రాజ్యాంగంలో గట్టి నిబంధనలు వుండడం వల్లే ఇది సాధ్యమైంది. గిరిజనులకు కూడా ఈ నిబంధనను వర్తింపజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అటువంటి నిబంధన లేకుంటే కొంతకాలం తరువాత గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు అంతరించిపోయే ప్రమాదం వుంది. ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా దేశంలోనే కోట్లాది మంది గిరిజనులకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టాలి. మతమార్పిడి అయినా వారిని జాబితా నుంచి గిరిజనులను తొలగించాలని కోరుతున్నట్లు పలువురు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌తో సహా భారతదేశంలో మతమార్పిడి అనేది స్వాతంత్య్రానికి పూర్వం నుంచి భారతదేశంలోని షెడ్యూల్డ్ తెగలకు పెద్ద ముప్పుగా ఉందని. విదేశీ మతం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మారడం కొత్త విషయం కాదని.. అయితే ఇది గత కొన్ని దశాబ్దాలుగా భారీ పెరుగుదలను చూసిందన్నారు. ఇటువంటి మతమార్పిడులు గిరిజన సమాజాన్ని స్లో పాయిజన్ లాగా ప్రభావితం చేస్తున్నాయి అని అన్నారు. ఇది వారి అసలు నమ్మకాలు, సంస్కృతి, ఆచారాలు మరియు ఆచారాలను నాశనం చేస్తోందన్నారు. నిజానికి గిరిజన సమాజానికి రిజర్వేషన్లు కల్పించడం వల్ల వారి సామాజిక, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. కానీ గిరిజనులు తమ అసలు విశ్వాసాన్ని, సంస్కృతిని, ఆచారాలను తిరస్కరించి మరో మతంలోకి మారినప్పుడు గిరిజన రిజర్వేషన్ యొక్క ప్రాథమిక ప్రయోజనం అర్థరహితమవుతుంది. ఇప్పుడు ప్రశ్న తలెత్తుతుంది, ఒక వ్యక్తి తన సొంత సంఘం గుర్తింపును కోల్పోయినప్పుడు, అతను తన అసలు గుర్తింపును కాపాడుకోవడానికి ఇచ్చిన ప్రయోజనాలను ఎలా పొందగలడు? అందుకే వారి స్థానిక సంస్కృతి, ఆచారాలు, భాషలు, సంప్రదాయాలు మరియు వారి పూర్వీకుల వారసత్వాన్ని కాపాడటానికి జనజాతి సురక్షా మంచ్ యిరొజున (2023 ఏప్రిల్ 9న) భారీ ర్యాలీని నిర్వహించగా.. ఇందులో అన్ని ఉత్తర ఆంధ్ర జిల్లాల నుండి వేలాది మంది గిరిజనులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో గిరిజన ఐక్యవేదిక జాతీయ గౌరవ అధ్యక్షులు, విశిష్ట అతిథులుగా శ్రీ సూర్యనారాయణ, అఖిల భారతీయ సంఘటనా మంత్రి, జనజాతి సురక్ష మంచ్ భోపాల్ శ్రీ శ్రీ సాయిరాం స్వామీజీ, సద్గురు సేవా ఆశ్రమం, విశాఖపట్నం, శ్రీ రామానంద స్వామీజీ, ఉత్తరవాహిని, బలిఘట్టం ఆశ్రమం పాల్గొంటున్నారు. శ్రీ వివేక్ వినాయక్, శ్రీ తమర్భ బాబురావు నాయుడు, Rtd. I.A.S., శ్రీ బాకురు కరుణాకర్, అడ్వకేట్, రాష్ట్ర ఉపాధ్యక్షులు, జనజాతి సురక్ష మంచ్, డాక్టర్ తమర్భ నర్సింగ రావు, రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ మెంబర్, ఆంధ్ర ప్రదేశ్, శ్రీ ఓండ్రు రామమూర్తి, అడిషనల్ రిజిస్టర్/ మెంబర్ ఏ.పీ. కోఆపరేటివ్ ట్రిబ్యునల్, శ్రీమతి కిముడు దేవి, సోషల్ వర్కర్, గిరిజన ఐక్యవేదిక ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్, పాల్గొన్నారు.
మతం మారిన గిరిజనులను ఎస్టీల జాబితా నుంచి తొలగించాలని జనజాతి సురక్షా మంచ్ జాతీయ ప్రతినిధి హెచ్.కె. నాగు డిమాండు చేశారు. జనజాతి సురక్షా మంచ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో పాడేరులో నిర్వహించిన గిరిజన సంస్కృతి పరిరక్షణ సమ్మేళనానికి ”ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా పట్టణ శివారు తదారిసింగి నుంచి గిరిజన ప్రజలు, హిందూధార్మిక సభ్యులు కలిసి ర్యాలీగా ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణానికి చేరుకున్నారు. మతం మారిన గిరిజనులకు ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని, గిరిజన సంస్కృతిని పరిరక్షణ చేసుకోవాలని, విదేశీ సంస్కృతి వద్దు… స్వదేశీ సంస్కృతి ముద్దు అనే నినాదాంతో పట్టణ వీధులను హోరెత్తించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో తెలంగాణ రాష్ట్రం ఆదిలా బాద్ ఎంపీ సోయం బాబూరావు మాట్లాడుతూ…. జీఓ నం3ని పునరుద్దరించాలని డిమాండ్ చేశారు. ఇది చాలక ఆంధ్రప్రదేశ్లో వైకాపా, తెదేపాలు కలిసి బోయ వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు విఫలయత్నం చేయడం ఆందోళన కలిగించే అంశంగా మారిందన్నారు. గతంలో తెదేపా ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానించి పార్లమెంట్‌కు పంపితే కేంద్ర ప్రభుత్వం వెనక్కి పంపిందన్నారు. ఇప్పుడు వైసీపీ మరోసారి తీర్మానం చేసి పంపితే గిరిజనులంతా ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు.. మతం మారిన గిరిజనులంతా తిరిగి స్వధర్మంలోకి రావాలని ఆయన కోరారు. లేదంటే వారి ధ్రువపత్రాల్లో కూడా మతాన్ని మార్చుకోవాలని డిమాండు చేశారు. ఇతర రాజకీయ పార్టీలు సైతం మతం మారిన గిరిజనుల పట్ల ఇదే వైఖరి అవలంభించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో కూడా పెద్ద సంఖ్యలో మతమార్పిడులు జరిగాయి. ఆ కారణంగా నిజమైన గిరిజనులు పలు సౌకర్యాలను కోల్పోతున్నారు. క్రైస్తవ మతంలోకి మారిన కారణంగా షెడ్యూల్ కులాల రిజర్వేషన్ తో ఎన్నికైన ఒక శాసనసభ్యుడుని ఇటీవలే కేరళ హైకోర్టు అనర్హుడిగా ప్రకటించింది. రాజ్యాంగంలో గట్టి నిబంధనలు వుండడం వల్లే ఇది సాధ్యమైంది. గిరిజనులకు కూడా ఈ నిబంధనను వర్తింపజేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అటువంటి నిబంధన లేకుంటే కొంతకాలం తరువాత గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు అంతరించిపోయే ప్రమాదం వుంది. ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా దేశంలోనే కోట్లాది మంది గిరిజనులకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టాలి. మతమార్పిడి అయినా వారిని జాబితా నుంచి గిరిజనులను తొలగించాలని కోరుతున్నట్లు పలువురు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌తో సహా భారతదేశంలో మతమార్పిడి అనేది స్వాతంత్య్రానికి పూర్వం నుంచి భారతదేశంలోని షెడ్యూల్డ్ తెగలకు పెద్ద ముప్పుగా ఉందని. విదేశీ మతం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మారడం కొత్త విషయం కాదని.. అయితే ఇది గత కొన్ని దశాబ్దాలుగా భారీ పెరుగుదలను చూసిందన్నారు. ఇటువంటి మతమార్పిడులు గిరిజన సమాజాన్ని స్లో పాయిజన్ లాగా ప్రభావితం చేస్తున్నాయి అని అన్నారు. ఇది వారి అసలు నమ్మకాలు, సంస్కృతి, ఆచారాలు మరియు ఆచారాలను నాశనం చేస్తోందన్నారు. నిజానికి గిరిజన సమాజానికి రిజర్వేషన్లు కల్పించడం వల్ల వారి సామాజిక, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. కానీ గిరిజనులు తమ అసలు విశ్వాసాన్ని, సంస్కృతిని, ఆచారాలను తిరస్కరించి మరో మతంలోకి మారినప్పుడు గిరిజన రిజర్వేషన్ యొక్క ప్రాథమిక ప్రయోజనం అర్థరహితమవుతుంది. ఇప్పుడు ప్రశ్న తలెత్తుతుంది, ఒక వ్యక్తి తన సొంత సంఘం గుర్తింపును కోల్పోయినప్పుడు, అతను తన అసలు గుర్తింపును కాపాడుకోవడానికి ఇచ్చిన ప్రయోజనాలను ఎలా పొందగలడు? అందుకే వారి స్థానిక సంస్కృతి, ఆచారాలు, భాషలు, సంప్రదాయాలు మరియు వారి పూర్వీకుల వారసత్వాన్ని కాపాడటానికి జనజాతి సురక్షా మంచ్ యిరొజున (2023 ఏప్రిల్ 9న) భారీ ర్యాలీని నిర్వహించగా.. ఇందులో అన్ని ఉత్తర ఆంధ్ర జిల్లాల నుండి వేలాది మంది గిరిజనులు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో గిరిజన ఐక్యవేదిక జాతీయ గౌరవ అధ్యక్షులు, విశిష్ట అతిథులుగా శ్రీ సూర్యనారాయణ, అఖిల భారతీయ సంఘటనా మంత్రి, జనజాతి సురక్ష మంచ్ భోపాల్ శ్రీ శ్రీ సాయిరాం స్వామీజీ, సద్గురు సేవా ఆశ్రమం, విశాఖపట్నం, శ్రీ రామానంద స్వామీజీ, ఉత్తరవాహిని, బలిఘట్టం ఆశ్రమం పాల్గొంటున్నారు. శ్రీ వివేక్ వినాయక్, తదితరులు పాల్గొన్నారు..