Home News తెలంగాణ ఎన్నికలు: 16 మంది అభ్యర్థులపై ఈసీకి ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి (NSCRPS) ఫిర్యాదు

తెలంగాణ ఎన్నికలు: 16 మంది అభ్యర్థులపై ఈసీకి ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి (NSCRPS) ఫిర్యాదు

0
SHARE
తెలంగాణ ఎన్నికలు మరి కొన్ని రోజుల్లోనే ఉన్నాయనగా ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాల నుండి బరిలోకి దిగుతున్న 16 మంది అభ్యర్థులపై ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు అందింది. ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాల నుండి పోటీ చేస్తున్న వీరంతా క్రైస్తవ మతం తీసుకున్నట్టు జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి అధ్యక్షులు కర్నె శ్రీశైలం ఎన్నికల కమిషనరుకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సందర్భంగా కర్నె శ్రీశైలం మాట్లాడుతూ జీవో 1793 ప్రకారం షెడ్యూల్డ్ కులాలకు చెందినవారు క్రైస్తవ మతంలోకి మారితే వారు బీసీ-సి కేటగిరీగా పరిగణించబడతారని తెలిపారు. మాజీ ఉపముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ టీఆరెస్ అభ్యర్థి టి. రాజయ్య తాను క్రైస్తవుడినని బహిరంగంగానే ప్రకటించారని, కానీ అతనికి తహసీల్దార్ ఎస్సీ సర్టిఫికెట్ ఇచ్చినట్టు తెలియజేసారు. రాజయ్యకు ఎస్సీ కుల ధ్రువీకరణ ఇచ్చిన తహసీల్దార్ మీద చర్య తీసుకోవాలని కర్నె శ్రీశైలం డిమాండ్ చేశారు.
జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి దాఖలు చేసిన ఫిర్యాదుపై స్పందించిన ఎన్నికల కమిషనర్ రాజత్ కుమార్ మాట్లాడుతూ.. ఫిర్యాదులో పేర్కొన్న అంశాలపై దర్యాప్తు చేస్తామని, ఎస్సీ కమిషన్ సలహా తీసుకుని దీనిపై తగిన చర్యలు చేపడతామని తెలిపారు.
జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి దాఖలు చేసిన ఫిర్యాదులో అభ్యర్థులలో ఎనిమిది మంది టీఆరెస్, ముగ్గురు కాంగ్రెస్, నలుగురు బీజేపీ మరియు ఒక బీఎస్పీ పార్టీ అభ్యర్థులు ఉన్నారు.