Home News రామమందిరం కోసం చట్టం చేస్తే స్వాగతిస్తాం: బాబ్రీ మసీదు పిటిషనర్ ఇక్బాల్ అన్సారీ 

రామమందిరం కోసం చట్టం చేస్తే స్వాగతిస్తాం: బాబ్రీ మసీదు పిటిషనర్ ఇక్బాల్ అన్సారీ 

0
SHARE
అయోధ్య రామమందిరం నిర్మాణానికి క్రమక్రమంగా అనూహ్య మద్దతు వస్తోంది. తాజాగా బాబరీ మసీదు తరఫున ప్రధాన పిటిషనర్ ఇక్బాల్ అన్సారీ మందిరానికి మద్దతు తెలిపారు. మందిర నిర్మాణానికి ఆర్డినెన్సు తీసుకురావాలని కోరారు. ఇక్బాల్ అన్సారీ బాబరీ మసీదు కోసం పిటిషన్ వేసిన మొదటి పిటిషనర్ హషిమ్ అన్సారీ కుమారుడు. హషిమ్ అన్సారీ మరణానంతరం ఆ కేసులో ప్రస్తుతం పిటిషనరుగా కొనసాగుతున్నారు.
రాజకీయ పార్టీలు ఈ అంశాన్ని రాజకీయం చేయడం తగదని చెప్పిన ఇక్బాల్ అన్సారీ, అయోధ్యలో రామ మందిరం కోసం ప్రభుత్వం ఎలాంటి చట్టం చేసినా స్వాగతిస్తానని తెలిపారు. ఐతే ఇది దేశంలోని మతసామరస్యాన్ని కాపాడే విధంగా ఉంటె బాగుంటుంది అని అన్నారు.
ఇక్బాల్ అన్సారీ నిర్ణయాన్ని అయోధ్య రామమందిర ప్రధాన పూజారి స్వామి శ్రీ సతేంద్ర దాస్ స్వాగతించారు. ఎన్నో ఏళ్లుగా టెంట్ కింద ఉంటున్న శ్రీరాముడికి ఇకనైనా ప్రభుత్వం చట్టం ద్వారా మందిరం నిర్మాణం చేయాలని స్వామి సతేంద్ర దాస్ కోరారు.
గతంలో కూడా ఇక్బాల్ అన్సారీ తండ్రి హషిమ్ అన్సారీ ఈ విషయంలో రాజీకి ప్రయత్నించారని కానీ అది నెరవేరలేదని, ఇప్పటికైనా ఇక్బాల్ ఇలాంటి నిర్ణయానికి రావడం హర్షించదగ్గ విషయమని సతేంద్ర దాస్ తెలిపారు.