Home News VIDEO: మే 11 జాతీయ సాంకేతిక దినోత్సవం

VIDEO: మే 11 జాతీయ సాంకేతిక దినోత్సవం

0
SHARE

భార‌త సైన్యం 1998 మే 11న రాజస్థాన్‌లోని పోఖ్రాన్ ‌లో అప్పటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజపేయి నేతృత్వంలో రెండవ అణ్వస్త్ర పరీక్షలు నిర్వహించారు. దీన్నే పోఖ్రాన్-II అంటారు. దీనిలో భారత్ విజయాన్ని సాధించింది. ‌తర్వాత నుంచి మన ‌దేశాన్ని అణు దేశంగా ప్ర‌క‌టించ‌డ‌మేకాకుండా మే 11వ తేదీని జాతీయ సాంకేతిక దినోత్సవంగా ప్ర‌క‌టించి అధికారికంగా సంతకం చేశారు. ఇదేరోజు ఏరోస్పేస్ ఇంజనీరుగా ఉన్న డా. అబ్దుల్ కలాం నిర్వహించిన మొదటి దేశీయ విమానం హంస-3 పరీక్షలు, త్రిశూల్‌ క్షిపణులు, ఆపరేషన్లు కూడా విజయవంతంగా పరీక్షించబడ్డాయి. అప్పటి నుంచి భారత్ సాంకేతిక పురోగతికి గుర్తుగా ప్రతి సంవత్సరం మే 11న మనం జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.