Home News అత్యాచారయత్నాన్ని ప్రతిఘటించినందుకు శిక్షగా తల్లీకూతుళ్లకు గుండు గీయించిన ముస్లిం కౌన్సిలర్

అత్యాచారయత్నాన్ని ప్రతిఘటించినందుకు శిక్షగా తల్లీకూతుళ్లకు గుండు గీయించిన ముస్లిం కౌన్సిలర్

0
SHARE

సభ్య సమాజం తలదించుకునే రీతిలో ఒక ముస్లిం కౌన్సిలర్ మహిళలపై దారుణమైన ఘాతుకానికి పాల్పడ్డాడు. కూతురిపై జరుగుతున్న అత్యాచారాన్ని అడ్డుకున్న తల్లిపై, ఆమె కూతురిపైనా తన అనుచరులతో కలిసి దాడికి పాల్పడ్డాడు. అనంతరం వారికి గుండు గీయించి ‘శిక్ష’ విధించాడు. 

బీహార్ రాష్ట్రం భగవాన్-పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. పోలీస్ స్టేషన్ అధికారి సంజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం స్థానిక వార్డు కౌన్సిలర్ మహమ్మద్ ఖుర్షిద్ మరో 6గురితో పాటు బాధితురాలి ఇంట్లోకి చొరబడి ఆమెపై అత్యాచారం జరపడానికి ప్రయత్నించాడు. ఈలోపు ఆమె తల్లి వచ్చి అడ్డుకోవడంతో కోపోద్రిక్తుడైన మహ్మద్ ఖుర్షిద్ తల్లీకూతుళ్లపై దాడి చేసి, కర్రలతో విచక్షణారహితంగా కొట్టి బయటకు తీసుకెళ్లి పంచాయితీలో నిలబెట్టాడు. అక్కడికి ఒక క్షురకుడిని పిలిచి వారిద్దరికీ గుండు గీయించి గ్రామం మొత్తం తిప్పించాడు.

నేరానికి పాల్పడిన మహమ్మద్ ఖుర్షిద్ తో పాటు అతడి అనుచరులను పోలీసులు అరెస్ట్ చేసి ఐపీసీ సెక్షన్ 376, 511 కింద కేసు నమోదు చేశారు. 

మహమ్మద్ ఖుర్షిద్ అక్రమ మాంసం ఎగుమతి వ్యాపారం నిర్వహిస్తాడని స్థానికులు తెలిపారు. 

Source: Hintustan Times