Home News 242 కోట్ల రూపాయల అవినీతి కేసులో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల నాథ్ సమీప బంధువు!

242 కోట్ల రూపాయల అవినీతి కేసులో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల నాథ్ సమీప బంధువు!

0
SHARE

ఆదాయపన్ను శాఖ ఏప్రిల్ 4న నిర్వహించిన దాడులలో సీజ్ చేసిన రూ. 242 కోట్లు పాటు లభ్యమైన డైరీల ద్వారా మోసర్ బేర్ కంపెనీ చైర్మన్, కాంగ్రెస్ నేత కమల్ నాధ్ సమీప బంధువు దీపక్ పురి బోగస్ పత్రాలను సృష్టించి డాల్లర్ల లోకి మార్చడంలో ప్రధాన పాత్ర పోషించినట్లు న్యూస్ 18 ఛానెల్ ఒక కధనంలో వెల్లడించింది.

ఛానెల్ కధనం ప్రకారం ఆదాయ పన్ను శాఖ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్నాథ్ OSD, రతుల్ పురి ( కమల్ నాథ్ మేనల్లుడు ), అమిర గ్రూప్ మరియు మోసర్ బేర్ గ్రూప్ చెందిన 50 కి పైగా స్థలాలలో దాడులు నిర్వహించింది. ఆదాయ పన్ను శాఖ దాడుల్లో స్వాధీనం చేసుకున్న డైరీలో నకిలీ బిల్లులను సృష్టించి కోట్ల రూపాయలను డొల్ల కంపనీలలోకి బదిలీ చేయడాన్ని గురించిన వివరాలు ఉన్నాయి.

సీజ్ చేయబడ్డ డైరీ ప్రకారం దాదాపు 242 కోట్ల రూపాయలు పరస్మాల్ లోధా యజమానిగా ఉన్న డొల్ల కంపెనీలలోకి బదిలీ అయ్యాయి. అలాగే కోల్ కతా కేంద్రంగా పని చేస్తున్న కంపెనీని కూడా 125 కోట్ల బోగస్ పెట్టుబడులు బదిలీ చేయడానికి ఉపయోగించుకున్నారు.

నివేదిక ప్రకారం మోసర్ బేర్ కంపెనీ 250 కోట్ల విలువైన షేర్లను కూడా మారిషస్ డొల్ల కంపెనీల ద్వారా కొన్నది. దీపక్ పురి డబ్బును పొందడానికి వివిధ మార్గాల ద్వారా నకిలీ బిల్లులను సృష్టించి డబ్బు పొందాడని డైరీ ప్రకారం తెలుస్తోంది.

గురువారం కూడా ఐ.టి అధికారులు సమాంతరంగా భోపాల్, ఇండోర్,గోవా మరియు ఢిల్లీ లోని 35 ప్రాంతాలలో దాడులు నిర్వహించారు. ౩౦౦ పైగా ఐ.టి అధికారులు మోసర్ బేర్ చెందిన ఉద్యోగుల ఇళ్లపై దాడులు నిర్వహించారు. భోపాల్ కు చెందిన ప్రతీక్ జోషి సూట్ కేస్ లో కుక్కిఉన్న పెద్ద మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు.

ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్నాథ్ మేనల్లుడు రతుల్ పురి ని 3600 కోట్ల అగస్టా వెస్ట్ ల్యాండ్ కుంభకోణానికి సంబంధించి గురువారం నాడు ప్రశ్నించింది. శక్రవారం రెండోసారి ప్రశ్నించేందుకు సమన్లు జారీ చేసింది.

అయితే, రతుల్ పురి మాట్లాడుతూ తాను విచారణకు సహకరిస్తున్నానని, రక్షణ శాఖ ఒప్పందాలతో తనకు సంబంధం లేదని, సొంత వ్యాపారాన్ని నడుపుతున్నానని తెలిపాడు.

అంతకు ముందు, ఎన్ఫోర్సుమెంట్ డైరెక్టరేట్ అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్ కుంభకోణపు ప్రధాన నిందితుడు, మధ్యవర్తి అయిన క్రిస్టియన్ మైఖేల్ తీసుకున్న ముడుపులకు సంబదించిన నగదు విచారణను సాగిస్తున్నప్పుడు మోసర్ బేర్ పేరు బయటకు వచ్చింది. నిధులు దీపక్ పురి స్వంత సంస్థ అయిన మోసర్ బేర్ ద్వారా చేతులు మారాయని తేలింది.

దీపక్ పురి, కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్నాథ్ బావ . దీపక్ పురి కమల్ నాథ్ సోదరి నీత పురి ని పెళ్లి చేసుకున్నారు. వారి కుమారుడు రతుల్ పురి . నీత మరియు రతుల్ ఇద్దరూ మోసర్ బేర్ లో భాగస్తులు.

అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్ కుంభకోణంలో మధ్యవర్తి అయిన క్రిస్టియన్ మైఖేల్ ను దుబాయ్ నుండి తీసుకువచ్చి విచారించినపుడు అతని పూర్వ పరిచయాల గురించి, ఇతర సంబందాల గురించి వెల్లడించాడు.

అగస్టా వెస్ట్ ల్యాండ్ ఛాపర్ కుంభకోణంలో మధ్యవర్తి అయిన క్రిస్టియన్ మైఖేల్ ను యునైటెడ్ అరబ్ ఏమిరట్స్ నుండి భారత్ కు 4 డిసెంబర్ న తీసుకువచ్చారు. ఇటీవల క్రిస్టియన్ మైఖేల్ గురించి వివరాలు తవ్వినపుడు అయన ప్రమేయం అగస్టా వెస్ట్ ల్యాండ్ కుంభ కోణానికే పరిమితం కాలేదని, ఫ్రాన్స్ కు చెందిన రాఫెల్ కు వ్యతిరేకంగా, దాని ప్రత్యర్థి యూరో ఫైటర్ MMRCA ఒప్పందం ను సొంతం చేసుకోవడానికి లాబీయింగ్ చేసాడని తెలిసింది. జనవరి 5న, పాటియాల హౌస్ కోర్ట్ మైఖేల్ జుడిసియల్ కస్టడీ ని ఫిబ్రవరి 26 వరకు పొడిగించింది.

Source: opindia