Home News యూపీలో 50 కుటుంబాలు “ఘ‌ర్‌వాప‌సీ”

యూపీలో 50 కుటుంబాలు “ఘ‌ర్‌వాప‌సీ”

0
SHARE

ఉత్త‌ర‌ప్ర‌దేశ్, ఫ‌తేఘ‌ర్‌లోని గ్వాల్టోలికి చెందిన 50 కుటుంబాలు విశ్వ‌హిందూ ప‌రిష‌త్ చేప‌ట్టిన ఘ‌ర్ వాప‌సీ కార్య‌క్ర‌మంలో తిరిగి స్వ‌ధ‌ర్మాన్ని స్వీక‌రించారు. మంత్రోచ్ఛారణల మధ్య హిందూ మతంలోకి తిరిగి వచ్చిన వారికి హనుమాన్ చాలీసాను బహుకరించారు.

గ్వాల్టోలికి చెందిన ఉపాధ్యాయుడు సుజిత్ వాల్మీకి భార్య రీతు క్రైస్తవ మతం నుండి హిందూ ధర్మంలోకి తిరిగి రావ‌డం ఎంతో సంతోషంగా ఉన్నాన‌ని, తన ఇంట్లో ప్రతిష్టించిన హిందూ దేవతలకు పూజలు చేయ‌డం ప్రారంభించిన‌ట్టు తెలిపారు. ఐదేళ్ల క్రితం కొంతమంది వ్యక్తుల ప్రభావంతో తాను క్రైస్తవ మతాన్ని స్వీకరించి చ‌ర్చికి వెళ్ళ‌డం ప్రారంభించాన‌ని, కానీ కొద్ది కాలం త‌ర్వాత హిందూ ధర్మమే గొప్పదని గ్రహించి తిరిగి స్వ‌ధ‌ర్మాన్ని స్వీక‌రించిన‌ట్టు ఆమె పేర్కొంది.

ఈ సంద‌ర్భంగా విహెచ్‌పి స్థానిక‌ జిల్లా అధ్యక్షుడు దినేష్ తోమర్ మాట్లాడుతూ కొన్ని కార‌ణాల వ‌ల్ల ఇత‌ర మ‌తాల్లోకి వెళ్లిన వారు ఇప్పుడు తిరిగి స‌నాత‌న ధ‌ర్మంలోకి రావాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నార‌ని అటువంటి వారంద‌రిని సంప్ర‌దించి ఘ‌ర్ వాప‌సీ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తున్న‌ట్టు తెలిపారు. మ‌రో 600 కుటుంబాలు వీహెచ్‌పీని సంప్ర‌దించిన‌ట్టు ఆయ‌న తెలిపారు. ధర్మ రక్ష సంకల్ప్ అభియాన్ కింద ఈ 50 కుటుంబాలు తిరిగి హిందూ ధర్మంలోకి వచ్చాయని VHP ప్ర‌తినిధి శుభం సర్వేశ్వర్ తెలిపారు.

 Source : Hindu Post