Home News బోద‌న్ లో న‌‌కిలీ పాస్‌పోర్టులు  క‌ల‌క‌లం… 8 మంది అరెస్టు

బోద‌న్ లో న‌‌కిలీ పాస్‌పోర్టులు  క‌ల‌క‌లం… 8 మంది అరెస్టు

0
SHARE
 బోద‌న్ లో న‌కిలీ పాస్‌పోర్టుల వ్య‌వ‌హారం క‌ల‌క‌లం రేపుతోంది. ముస్లిం జనాభా ఎక్కువ‌గా ఉన్న బోధన్ పట్టణం దేశ‌భ‌ద్ర‌త‌కు ముప్పు క‌లిగించే మ‌రో చ‌ర్య‌కు కేంద్రంగా మారింది. ప‌ట్ట‌ణంలో ఇటీవ‌ల 80 న‌కిలీ పాస్‌పోర్టులను అధికారుల‌ను గుర్తించారు. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం…  ప‌ట్ట‌ణంలోని ష‌ర్బ‌త్ కెనాల్ ప్రాంతంలో కొంద‌రు వ్య‌క్తులు పాస్‌పోర్టు ద‌ర‌ఖాస్తు చేసుకోగా వారికి ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాల‌యం నుంచి వ‌చ్చిన పాస్‌పోర్టుల‌ను అందివ్వ‌డానికి త‌పాళ ఉద్యోగులు ఆయా ఇండ్ల‌లోకి వెళ్ల‌గా ఆ ఇండ్లు తాళం వేసి ఉండ‌డంతో వాటిని తిరిగి త‌పాళా కార్యాల‌యానికి తీసుకువ‌చ్చారు. ఇలా మొత్తంగా 80 పాస్‌పోర్టులు తిరిగి కార్యాల‌యానికి రావ‌డంతో విచారించిన అధికారులు అవి న‌కిలీవ‌ని గుర్తించారు.
రంగంలోకి దిగిన‌ పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు. గ‌తంలో అదే చిరునామాల్లో కొంత మంది పాస్‌పోర్ట్‌లు అందుకున్న స‌మాచారం మేర‌కు పోలీసులు ద‌ర్యాప్తును ముమ్మ‌రం చేశారు. నకిలీ పాస్‌పోర్ట్ ల వ్య‌వ‌హారం దేశ సార్వభౌమత్వానికి, సమగ్రతకు ముప్పు తెస్తున్నందున స్థానిక పోలీసులే కాకుండా, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్.‌ఐ.ఏ) కూడా ఈ కేసును నిశితంగా ప‌రిశీలిస్తోంది. నిజామాబాద్ జిల్లా పోలీసులతో పాటు బోధన్ పోలీసులు బంగ్లాదేశీయుల‌పై నిఘాను క‌ట్టుదిట్టం చేశారు. ఈ కేసులో ఇప్ప‌టి వ‌ర‌కు 8మందిని అరెస్టు చేసిన‌ట్టు పోలీసులు తెలిపారు.

అయితే అధిక డ‌బ్బుకు ఆశ‌ప‌డి ప‌ట్ట‌ణంలోని కొంత మంది మీ సేవా కేంద్రాల నిర్వ‌హ‌కులు రాష్ట్ర ప్ర‌భుత్వం అందిస్తున్న ప‌థ‌కాల నుంచి ల‌బ్ధి పొందెలా అక్ర‌మంగా న‌కిలీ పత్రాలు, ఆస్తి పత్రాలు, బ్యాంకుల నుండి రుణాలు పొందటానికి అవసరమైన పత్రాల‌ను సృష్టిస్తున్నారని పోలీసులు గుర్తించారు. గత కొద్ది రోజుల నుంచి ఆయా మీసేవా కేంద్ర నిర్వహ‌కులు ఆధార్ కార్డులు పొందటానికి కీలకమైన పత్రాలను కూడా తయారు చేస్తున్నారని కూడా పోలీసులు గుర్తించారు. న‌కిలీ దృవ ప్ర‌తాల‌తో బంగ్లాదేశ్‌కు నకిలీ పాస్‌పోర్టు జారీ చేయడానికి బోధన్ కేంద్రంగా మార‌డంతో సంబంధిత వ్య‌క్తుల క‌ద‌లిక‌పై పోలీసులు ప్ర‌త్యేక దృష్టి సారించారు.

Source : VSK BHARATH