Home News ఘ‌ర్‌వాప‌సీ: స‌నాత‌న ధ‌ర్మంలోకి 80 మంది ముస్లింలు

ఘ‌ర్‌వాప‌సీ: స‌నాత‌న ధ‌ర్మంలోకి 80 మంది ముస్లింలు

0
SHARE
  • 12 సంవత్సరాల క్రితం బ‌ల‌వంతంగా మ‌తంమార్చిన SP నాయ‌కుడు ఆజాం ఖాన్

ఉత్త‌రప్ర‌దేశ్ రాష్ట్రం ముజఫర్‌నగర్‌లోని 12 కుటుంబాలకు చెందిన 80 మంది ప్రజలు ఇస్లాంను విడిచిపెట్టి, బాగ్రాలోని యోగ్ సాధనా ఆశ్రమంలో మహంత్ స్వామి యశ్వీర్ మహరాజ్ సమక్షంలో సనాతన ధర్మాన్ని స్వీకరించారు. ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన 80 మంది సభ్యులు తాము ఇంతకు ముందు హిందువులమేన‌ని, సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు ఆజం ఖాన్ చేత ఇస్లాం మ‌తంలోకి మారాల‌ని ఒత్తిడి చేసి బ‌ల‌వంతంగా మ‌తం మార్పిడి చేశాడ‌ని వారు ఆరోపించారు.

12 సంవత్సరాల క్రితం ఆజం ఖాన్ తమను హిందూ మతాన్ని విడిచిపెట్టి ఇస్లాంను అంగీకరించమని బలవంతంగా మతమార్పిడి చేసిన తర్వాత, ఖాన్, అతని అనుచరులు ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన వారి ఆస్తులుల‌ను, సంపదను స్వాధీనం చేసుకున్నారని కూడా వారు ఆరోపించారు. గ‌త 12 ఏండ్లుగా ఇస్లాం మ‌తంలో విసుగు చెంది, చివ‌ర‌కు ఇస్లాంను విడిచిపెట్టి సనాతన ధర్మాన్ని అంగీకరించారు.

గాయత్రీ మంత్రాన్ని పఠించి, హిందూ మతపరమైన కంక‌ణాన్ని స్వీకరించడం ద్వారా ఘర్ వాప‌స్ అయ్యారు. యశ్వీర్ మహరాజ్ గంగా నీటితో వారిని శుద్ధి చేశారు. హిందూ మ‌తంలోకి వ‌చ్చిన త‌ర్వాత పేరు మార్చుకున్న కవిత అనే మ‌హిళా మాట్లాడుతూ, “12 సంవత్సరాల క్రితం, ఆజం ఖాన్ మమ్మల్ని ఇస్లాంలోకి మార్చమని బలవంతం చేశాడు. మా సంపదను, ఆస్తులను కూడా లాక్కున్నాడు. అతను చాలా ఇతర ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన కుటుంబాలను అనేక ఇబ్బందుల‌కు గురిచేశాడు” అని చెప్పారు. సవిత అనే మ‌రో మ‌హిళా మాట్లాడుతూ, “ఆజం ఖాన్ చాలా మందిని వేధించాడు. ప్రజలను బలవంతంగా ఇస్లాంలోకి మార్చాడు. అతను చేసిన పాపాల కారణంగా జైలులో ఉన్నాడు. ఘర్ వాప‌సీ తర్వాత ఇప్పుడు సంతోషంగా ఉన్నాం” అని సంతోషం వ్య‌క్తం చేసింది.

బాగ్రాలోని యోగ్ సాధనా ఆశ్రమంలో మహంత్ స్వామి యశ్వీర్ మహారాజ్ మాట్లాడుతూ 12 సంవత్సరాల క్రితం వీరిని ప్రలోభపెట్టి వారి మతం మార్చుకోవాలని బెదిరించ‌డంతో దిక్కుతోచ‌ని స్థితిలో మ‌తం మారిన ఈ ప్రజలు గంగా నీటితో శుద్ధి చేయబడ్డారు. ఇప్పుడు వారు హిందువులుగా పిలువబడతార‌ని మహాన్ ప్రకారం, అతను దాదాపు 530 మంది ఘర్ వాప్సీ చేసాడు.