మారుపేరుతో యువతిని మోసం చేసి లవ్‌జీహాద్ కు పాల్పడ్డ 23 ఏళ్ల యువకుడిని పెళ్లికి ఒక రోజు ముందు పోలీసులు అరెస్టు చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని గ్రేటర్ నోయిడాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం… ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడా పరిధిలోని దాద్రీకి చెందిన హసీన్ సైఫీ అనే వ్యక్తి ఆశిష్ ఠాకూర్ అనే మారుపేరుతో ఉత్తరాఖండ్‌కు చెందిన ఒక మహిళతో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత ఆ మహిళ ఉద్యోగం మానేయడంతో నిందితుడు దాన్ని అవకాశంగా తీసుకుని ఆమెకు దగ్గరయ్యాడు. ఆ తర్వాత ఆమెతో పాటు దాద్రీలోని ఎస్కార్ట్ కాలనీలో అద్దెకు ఉంటున్న ఫ్లాట్‌లోకి మారాడు. ఈ క్రమంలో హసీన్ ఆమె అసభ్యకర వీడియోలు చేసి పెళ్లి కోసం ఒత్తిడి చేయడం ప్రారంభించాడు.
హసీన్ తండ్రి షకీల్ సైఫీ తన కొడుకు కోసం వెతుకుతూ వారి ఫ్లాట్‌కి చేరుకున్నాడు. నిందితుడు, మహిళ ఇంట్లో లేకపోవడంతో అతని తండ్రి ఇరుగుపొరుగు వారిని విచారించారు. అతని కుమారుడి పేరు హసీన్ అని ఆశిష్ పేరుతో నకిలీగుర్తింపుతో అక్కడ నివసిస్తున్నాడని తెలియడంతో అబద్ధం బట్టబయలైంది. ఆ వ్యక్తి ముస్లిం అని, అతని అసలు పేరు హసీన్ సైఫీ అని, వారు వివాహం చేసుకోబోయే ఒక రోజు ముందు మహిళకు తెలిసి పెళ్లికి నిరాకరించింది. ఆ తర్వాత ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసినట్టు అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ దినేష్ కుమార్ సింగ్ తెలిపారు.
నిందితుడిపై భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ 376 (రేప్), ఉత్తరప్రదేశ్ చట్టవిరుద్ధమైన మత మార్పిడి ఆర్డినెన్స్, 2020 నిబంధనల ప్రకారం కేసు నమోదు చేశామని, ఈ కేసులో తదుపరి చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని పోలీసు అధికారి తెలిపారు.
Source : NEWS BHARATHI