Home News ప్రధాని మోదీ హత్యకు కుట్ర?

ప్రధాని మోదీ హత్యకు కుట్ర?

0
SHARE

*    మరో 21 మంది నేతలు టార్గెట్‌

*   తమిళనాట పేలుళ్ల కుట్ర భగ్నం

*    నలుగురు ఉగ్రవాదుల అరెస్టు

*    నెల్లూరు, చిత్తూరు, మైసూరు

*    కోర్టు ఆవరణల్లో పేలుళ్లలో పాత్ర

*    గ్యాంగ్‌ లీడర్‌ హకీం పరార్‌

*    అల్‌కాయిదా లింక్‌పై అనుమానం

పేలుళ్ల ద్వారా ప్రధానమంత్రిని హత్య చేసేందుకు పన్నిన కుట్రను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) భగ్నం చేసింది. తమిళనాడులో నలుగురు అల్‌కాయిదా సానుభూతి పరులైన ఉగ్రవాదులను అరెస్టు చేసింది. ఉగ్రవాదుల గ్యాంగ్‌ లీడరైన హకీం చివరిక్షణంలో ఎన్‌ఐఏ వల నుంచి తప్పించుకున్నాడు. అతని కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. వీరంతా ప్రధానితోపాటు 22 మంది నేతలను, పలు దేశాల దౌత్య కార్యాలయాలను లక్ష్యంగా చేసుకొని బాంబు పేలుళ్లు చేపట్టేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. పట్టుబడిన నలుగురినీ రహస్య ప్రదేశంలో ఉంచి విచారిస్తున్నారు. ఆదివారం రాత్రి మదురైకి చెందిన ఎన.అబ్బా్‌స అలీ(27), టి.అయూబ్‌ఖాన(26), అబ్దుల్‌ కరీంలను ఎనఐఏ అధికారులు అరెస్టు చేశారు.

పెయింటర్‌గా పని చేస్తున్న అబ్బాస్‌ అలీ ఇటీవలే నేలపేటలో ఇస్లాం మత గ్రంథాలతో కూడిన గ్రంథాలయాన్ని తెరిచాడు. అబ్దుల్‌ కరీం కాట్రపాలయంలో ప్రింటింగ్‌ ప్రెస్‌ నిర్వహిస్తున్నాడు. అయూబ్‌ఖానకు ఇటీవలే వివాహమైంది. విచారణలో వారు అందించిన సమాచారం ప్రకారం చెన్నైలోని ఓ ఐటీ సంస్థలో సిస్టమ్‌ అనలి్‌స్టగా పనిచేస్తున్న దావూద్‌ సులేమానను పోలీసులు సోమవారం సాయంత్రం అదుపులో తీసుకున్నారు. స్థానిక తిరువాన్మియూరులో అద్దె ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న సులేమాన్‌ను ఎనఐఏ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఎనఐఏ కార్యాలయానికి తీసుకెళ్లి విచారణ జరుపుతున్నారు.

మదురై జిల్లాలో ముగ్గురు అనుచరులను అరెస్టు చేశారన్న విషయం తెలిశాకే సులేమాన్‌ ఆదివారం రాత్రి మధురై నుంచి బస్సులో చెన్నై వచ్చాడు. ఎనఐఏ అధికారులు అప్రమత్తం కావడంతో పట్టుబడ్డాడు. నలుగురిలో అయూబ్‌ఖాన్‌ పాత్ర ఇంకా నిర్ధారణ కాలేదు. నలుగురికీ ఏపీలోని చిత్తూరు, నెల్లూరు, కేరళలోని కొల్లం, మళప్పురం, కర్ణాటకలోని మైసూరు కోర్టుల్లో జరిగిన బాంబు పేలుళ్లతో సంబంధం ఉంది. నలుగురి వద్దా భారీగా పేలుడు పదార్థాలు, కొంత నగదు, సెల్‌ఫోన్లు లభ్యమయ్యాయి. నెల్లూరు కోర్టులో జరిగిన బాంబు పేలుడు సందర్భంగా ‘ది ఫేస్‌ ఆర్గనైజేషన్‌’ పేరుతో కరపత్రాలు లభ్యమయ్యాయి. అందులో ‘ద బేస్‌ మూమెంట్‌’ అని పేర్కొన్నారు. అల్‌కాయిదా అర్థం కూడా అదే. వాటి ఆధారంగా ఎనఐఏ అధికారులు దర్యాప్తు జరిపారు. ఈ విచారణలో దిగ్ర్భాంతి గొలిపే సమాచారం లభ్యమైనట్లు తెలిసింది. ప్రధాని మోదీ సహా మొత్తం 22 మంది నేతల హత్యకు వ్యూహరచన చేశారని, దక్షిణ భారతదేశంలో ఉన్న వివిధ దేశాల కాన్సులేట్లను పేల్చి వేయడానికి కుట్ర పన్నారని తేలింది. నలుగురు తీవ్రవాదుల వేటలో ఏపీ, తెలంగాణ పోలీసులు కూడా సహకరించారు. నలుగురికీ నాయకుడిగా వున్న హకీం పరారైనట్లు ఎనఐఏ అధికారులు గుర్తించారు. అతని కోసం తమిళనాడు సరిహద్దుల్లో ముమ్మరంగా గాలిస్తున్నారు.

(ఆంధ్రజ్యోతి సౌజన్యం తో)