Home News “ప్లాస్టిక్ వాడకానికి స్వస్తి” అని నినదించిన ఐటి దండి వారి భక్తి మార్గానికి హాట్స్ ఆఫ్

“ప్లాస్టిక్ వాడకానికి స్వస్తి” అని నినదించిన ఐటి దండి వారి భక్తి మార్గానికి హాట్స్ ఆఫ్

0
SHARE

తెల్లని టోపీలపై ఎరుపు రంగుతో రాసిన “విరోచాచి యాత్రి  ప్లాసికలా కాత్రి” (వీరుల యాత్రలో ప్లాస్టిక్ హారతి) ఈ అక్షరాలు మూడు లక్షలకు పైగా జనాన్ని కదిలించాయి .

రెండువేల టోపీలు, మూడు రోజులపాటు 70కి.మీ వరకు, మూడు తండాల్లో సాగిన జనజాగృతి యాత్ర  – ఇదీ  ప్లాస్టిక్ సంచులకు స్వస్తి పలకడానికి ఐ టి రంగంలో పని చేస్తున్నవారు అనుసరించిన ఒక కొత్త మార్గం ! దీనికి వందలకొద్దీ కామెంట్లు, వేలకొద్దీ లైకులు వచ్చాయి కూడా.

మహారాష్ట్రలోని ఆళంది  గ్రామం నుండి తొలి ఏకాదశినాడు పాండురంగడిని దర్శించడం కోసం ప్రతి సంవత్సరం పాద యాత్ర చేయడం ఆనవాయితి.  కొన్నిసంవత్సరాలుగా ఐ టి రంగంలోని ఉద్యోగులు గ్రామ ప్రజలతో కలిసి సామాజిక సమస్యలపై ప్రజలను జాగృతపరుస్తున్నారు.

ప్రతి ఏడాదీ ఒక్కొక్క విషయంతో ఈ యాత్ర జరుగుతుంది. ఈ సంవత్సరం “ప్లాస్టిక్ వాడకానికి స్వస్తి చెపుదాం” అనే సందేశంతో యాత్ర సాగించాలని సంకల్పించారు. స్వామి కార్యంతో పాటు సామజిక కార్యం సాగింది.  పండరీపురానికి పయనమైన ఈ మూడు లక్షల మంది భక్తులు విఠలుని దర్శనం తరువాత బయిటికి వచ్చి `ప్లాస్టిక్ వాడం’ అంటూ ప్రతిజ్ఞ చేశారు.

టి దండి

ఇది 2006 లో రూపుదిద్దుకుంది. కేవలం ఆరుగురితో ఆరంభమైన ఈ సమూహం సభ్యుల సంఖ్యా 4 సంవత్సరాలలో గణనీయంగా పెరిగింది. సభ్యుల సంఖ్య 2014 లో375, 2015 లో 700, 2016 లో 1000, 2017 లో 1200కి చేరింది.   ఈ సంవత్సరం 1300 కంటే ఎక్కువమంది ఈ కార్యక్రమంలో చేరారు.  వైద్యులు, లాయర్లు ఉద్యమకారులు కూడా ఇందులో పాలుపంచుకుంటున్నారు.

కార్యక్రమంలో పాల్గొనడానికి సభ్యత్వం అవసరం. ఆన్ లైన్ లో సభ్యత్వ నమోదు చేసుకుని యాత్రలో పాల్గొనవచ్చు. ప్రతి సంవత్సరం యాత్ర మొదలయ్యేముందు నమోదు కార్యక్రమం ఉంటుంది.  చివర తేదీని కూడా తెలియచేస్తారు . సభ్యత్వానికి ముందే యాత్ర  ఏ విషయంపై సాగుతుందనేది కూడా నిర్ణయిస్తారు.

2017 లో “సైనికులను గౌరవించండి ” అంటూ యాత్ర సాగింది. దీనికి ముందు మిలిటరీ కార్యాలయానికి వెళ్లి వందకు పైగా కార్గిల్ వీరులకు మిఠాయిలు పంచిపెట్టారు. ప్రతి ఒక్కరు స్వయంప్రేరణతో విరాళాలు  సేకరించారు . ఇలా ఐదు  లక్షల  రూపాయలకు పైగా సేకరించి దానిని  చనిపోయిన సైనికుల కుటుంబాలకు ఇవ్వాలని నిర్ణయించారు . ఒక పెద్ద సభా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఒక్కొక్క కుటుంబానికి 15,251 రూపాయిల చొప్పున 15 కుటుంబాలకు ధన సహాయం అందజేశారు.

రైతుల ఆత్మహత్యలు ఎక్కువుగా ఉన్న సంవత్సరంలో “రైతులు దేశానికి వెన్నుముక, వారికి మేము అండ” అంటూ రైతులకు ధైర్యం చెపుతూ ముందుకు నడిచారు.

సముద్ర జీవాలకు ప్లాస్టిక్ తో ముప్పు ఉందని గుర్తించి ఈ  సంవత్సరం “ప్లాస్టిక్ వాడకానికి స్వస్తి పలుకుదాం”  అనే నినాదంతో యాత్ర ప్రారంభించారు. దీని కోసం తెల్ల టోపీల మీద ” విరోచాచి యాత్రి  ప్లాసికలా కాత్రి”(వీరుల యాత్రలో ప్లాస్టిక్ హారతి) అని ముద్రించి వాటిని ధరించి పాల్గొన్నారు.

ఈ యాత్రలో బ్రెజిల్ కు చెందిన రాఫెల్ పాలిం, జపాన్ నుండి ఒల్సోనా అనే ఇద్దరు ఇంజినీర్లు పాల్గొని భారతీయ పాదయాత్ర  సంస్కృతికి జోహార్లు పలికారు.

ప్రతి సంవత్సరం ఆళంది  గ్రామం నుండి 21 రోజుల పాటు జరిగే ఈ యాత్రలో ఐ టి సభ్యులు మొదటి రెండు రోజులు మాత్రమే పాల్గొంటారు. కానీ ఈ సంవత్సరం మూడవ రోజు కూడా పాల్గొని ప్రజలను జాగృత పరిచారు.

ప్లాస్టిక్ ను వదిలిపెట్టాలన్న సంకల్పంతో దర్శనం చేసుకున్న భక్తులను చూసి విఠలుడు ప్రసన్నుడై ఉంటాడు. ఎందుకంటే ఈ భక్తులు  తన భార్య అయిన భూదేవిని  ప్లాస్టిక్ నుంచి రక్షిస్తున్నారు కదా!

ఐ టి దండి సామజిక కార్యక్రమానికి హాట్స్ ఆఫ్.

అనువాదం: ప్రతిభ కల్లూర్