Home News పరిపూర్ణనంద స్వామి నగర బహిష్కరణ ను ఎత్తివేయాలి – హిందూ ఐక్య వేదిక, సంగారెడ్డి

పరిపూర్ణనంద స్వామి నగర బహిష్కరణ ను ఎత్తివేయాలి – హిందూ ఐక్య వేదిక, సంగారెడ్డి

0
SHARE

నేటికి హిందువుల పై ప్రత్యక్షంగా పరోక్షంగా దాడులు జరుగుతూనే ఉన్నాయని, అందులో భాగంగానే శ్రీ పరిపూర్ణనంద స్వామి పై తెలంగాణ ప్రభుత్వం 6 నెలల పాటు నగర బహిష్కరణ విదించిందని ఆరోపిస్తూ అట్టి ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలి అని సంగారెడ్డి లో జరిగిన హిందూ ఐఖ్య వేదిక డిమాండ్ చేసింది.

పరిపూర్ణనంద స్వామి హిందూ ధర్మ రక్షణ కొరకు ప్రయత్నం చేస్తున్నారని, అలంటి వారిని అకారణంగా ప్రభుత్వాలు నేరస్థుడిలాగ పరిగణించి బహిష్కరణ చేయడం హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని బుధవారం నాడు నగరంలోని సాయి బాబా ఆలయంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న పెద్దలు అభిప్రాయపడ్డారు.

హిందుత్వం పై ఆదరణ, యువత లో చైతన్యం రావడం వలన దుష్ట శక్తులు ముఖ్యంగా కొన్ని టీవీ చానల్ వాళ్ళు వివక్షతతో కేవలం హిందువులనే లక్ష్యంగా చేసుకొని  భావ స్వేఛ్చ అనే ముసుగులో మనోభావాలను దెబ్బ తీస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి వాటిని కట్టడి చేయాల్సిన ప్రభుత్వం, ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా ప్రవర్తించడం, హిందూ ధర్మ రక్షణకు పాల్పడుతున్న వ్యక్తులలో ఒకరు అయిన స్వామి పరిపూర్ణనంద లాంటి వారిని నగర బహిష్కరణ చట్ట విరుద్ధం అని మండిపడ్డారు.

ఈ సమావేశం లో గాయత్రీ పరివార్, భార్తీపూర్ బావి పీఠాదిపతి శ్రీ శ్రీ సిద్దేశ్వర స్వామి,  భీమశంకర మఠం అధిపతి శ్రీ శ్రీ శ్రీ సంతోష్ స్వామి, స్వద్యాయ సంస్థ ప్రతినిధులు, శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి, యువ వాహిని రవీంద్రనాథ్, టి టి డి సంస్థ సభ్యులు శ్రీ   గుండప్ప సంతోష్ కుమార్ స్వామి, శ్రీ దత్తాత్రేయ చౌహాన్, శ్రీ ప్రభాకర్, శ్రీ సురేష్, శ్రీ గిరిధర్, శ్రీ రవి, డా ప్రభాకర్, వి హెచ్ పి రాందాస్, ప్రకాశ్, సంధ్యా రాణి, రాష్ట్ర సేవిక సమితి, ధర్మ జాగరణ సభ్యులు  తదితరులు పాల్గొన్నారు.