Home News క్రైస్తవ మిషనరీ గృహంలో బాలికలపై అకృత్యాలు

క్రైస్తవ మిషనరీ గృహంలో బాలికలపై అకృత్యాలు

0
SHARE
దేశంలో క్రైస్తవ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్న వసతి గృహాల నిజస్వరూపం మరోసారి బయటపడింది. గతంలో బీహార్ లోని ఆశా కిరణ్ హోమ్ మరియు తమిళనాడులోని మెర్సీ అదైకలాపురం మిషనరీ హోమ్ ఉదంతాలు మరువక ముందే ఒడిశాలో మరొక దారుణం వెలుగుచూసింది.
ఓడిశాలోని దేనికనాల్ జిల్లా బెల్టికిరి గ్రామంలో గుడ్ న్యూస్ ఇండియా అనే క్రైస్తవ సంస్థలో ఆధ్వర్యంలోని డ్రీమ్స్ బాలికల వసతిగృహంలో జరుగుతున్న అత్యాచారాలు వెలుగుచూశాయి. దీంతోపాటు బాలికల క్రైస్తవ మతమార్పిళ్ల వ్యవహారం కూడా బయటపడటంతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి.
దీంతో పోలీసులు గుడ్ న్యూస్ ఇండియా స్వచ్ఛంద సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఫయాజ్ రెహ్మాన్ మరియు డ్రీమ్ వసతి గృహ ఉద్యోగి సీమాంచల్ నాయక్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వసతి గృహం నిర్వహణకు అసలు అనుమతి లేదని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ప్రఫుల్ల సమాల్ తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె తెలియజేసారు.
డ్రీమ్ బాలిక గృహానికి ఒడిశాలో సుమారు 26 శాఖలు ఉన్నాయి. అన్నిటినీ మూసివేసి, అక్కడ ఉన్న బాలికలను ఇతర గృహాలకు తరలించాల్సిందిగా  సంబంధిత జిల్లా కలెక్టర్లను మంత్రి ప్రఫుల్ల సమాల్ ఆదేశించారు.
జరుగుతున్న ఘటనలపై వాంగ్మూలం ఇచ్చిన డ్రీమ్ బాలికల గృహ వంటమనిషి పితాబస్ దిగల్ మాట్లాడుతూ.. డ్రీమ్ వసతి గృహ యజమాని రెహ్మాన్ బాలికలతో అసభ్యంగా ప్రవర్తించేవాడని.. అప్పుడప్పుడూ విదేశీయులు ఆ గృహాన్ని సందర్శించేవారని.. వారి ప్రవర్తన కూడా అదేవిధంగా ఉండేదని తెలియజేశాడు.
Source: Organiser