మెదక్ లో గిరిజన వసతిగృహ గృహం లో సద్గురు సంత్ సేవాలాల్ మహరాజ్ 280 వ జయంతి ఉత్సవాలు.
ధర్మ రక్షణకు,గోవుల సంరక్షణకు,దేశరక్షణకు సేవాలాల్ అనిర్వచణీయమైన కృషి చేశారని సామాజిక సమరసత వేదిక విభాగ్ కన్వీనర్ మత్స్యేంద్రనాథ్,బాద్యులు చోళ పవన్ కుమార్ తెలిపారు.
శ్రేష్టమైన జాతి నిర్మాణం కొరకు దైవభక్తిని విస్తరింపచేయడానికి, ఐక్యతను, సమరసతను చాటి చెప్పడానికి జన్మించిన అవతారపురుషుడు సంత్ సేవాలాల్ అన్నారు. జగదంబా మాత సాక్షాత్కరం పొందిన భక్తాగ్రేసరుడు సేవాలాల్ అన్నారు. అనంతరం విద్యార్థులకు వేదిక తరపున సంత్ సేవాలాల్ జీవిత చరిత్ర పుస్తకాలు అందచేశారు.అంతకుమందు సేవాలాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు.పుష్పాంజలి సమర్పించారు.ఈ కార్యక్రమంలో నవీందర్ నాయక్,మోహన్ నాయక్,రాము,సంతోష్,రూప్ సింగ్,మోతీలాల్,లక్ష్మణ్,గణేష్,సురేష్ తదితరులు పాల్గొన్నారు.