Home News సీపీఐ(ఎం) కార్యాలయంలో మహిళపై కమ్యూనిస్ట్ కార్యకర్త అత్యాచారం!

సీపీఐ(ఎం) కార్యాలయంలో మహిళపై కమ్యూనిస్ట్ కార్యకర్త అత్యాచారం!

0
SHARE
కేరళలోని కమ్యూనిస్ట్ పార్టీ కార్యాలయంలో మహిళపై అత్యాచారం జరిపిన ఘటన కొన్ని నెలల తర్వాత వెలుగుచూసింది. సీపీఐ(ఎం) విద్యార్థి విభాగం స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్.ఎఫ్.ఐ) కార్యకర్త తనపై పది నెలల క్రితం అత్యాచారం చేసినట్టు ఓ మహిళా నేత పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
వివరాల్లోకి వెళితే.. గత శనివారం పలక్కడ్ జిల్లా చేరుప్లస్సరీ ప్రాంతంలో రోడ్డు పక్కన అప్పుడే జన్మించిన ఓ పసికందును పోలీసులు గుర్తించారు. దీనిపై విచారించిన పోలీసులు ఎట్టకేలకు తల్లిని కనిపెట్టగా, ఆ మహిళ జరిగిన ఘటనను పోలీసులకు వివరించింది.
పది నెలల క్రితం బాధిత మహిళ ఓ కళాశాలకు చెందిన అనుబంధ పత్రిక సంచిక ప్రచురణకు సంబంధించిన పనిలో సహాయం కోసం సీపీఐ(ఎం) కార్యాలయానికి వెళ్లగా, అక్కడే ఉన్న ఎస్.ఎఫ్.ఐ కార్యకర్త తనపై అఘాయిత్యానికి పాల్పడినట్టు వెల్లడించింది.
నిందితుడి కుటుంబానికి కమ్యూనిస్టు పార్టీతో సన్నిహిత సంబంధాలున్నట్టు చేరుప్లస్సరీ స్థానిక సీపీఐ(ఎం) కార్యకర్త ఒకరు తెలియజేసారు. వెలుగులోకి వచ్చిన ఘటనపై పార్టీపరంగా విచారణ జరుపుతామని అతడు తెలియజేసాడు.
పోలీసులు నిందితుడి వాంగ్మూలం తీసుకోవాల్సి ఉండగా, బాధిత మహిళ, ఆమె యొక్క పసిపాప ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
వెలుగులోకి వచ్చిన ఘటనపై స్పదించిన కేరళ కాంగ్రెస్ ముఖ్యనేత రమేష్ చెన్నితాల, కమ్యూనిస్ట్ పార్టీల కార్యాలయాలు అత్యాచారాలకు వేదికలుగా మారిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేసారు. ఘటన జరిగిన కార్యాలయం ఎదుట కాంగ్రెస్ యువజన విభాగం కార్యకర్తలు ధర్నా నిర్వహించారు.
Source: News18