Home News ‘వివక్ష’ అంటూ ప్రచురితమైన వార్త వెనుక నిజానిజాలు

‘వివక్ష’ అంటూ ప్రచురితమైన వార్త వెనుక నిజానిజాలు

0
SHARE
ఈనెల 15వ తేదీన ప్రముఖ తెలుగు దినపత్రికలో ‘నవమి ఉత్సవాలకు దళితులను పిలవరా?’ పేరిట ఒక వార్త ప్రచురితమైంది. మహబూబాద్ జిల్లా కేసముద్రం మండలం అమీనాపురం గ్రామంలో శ్రీరామనవమి ఉత్సవాలకు గ్రామంలోని భూనీళా వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్వాహకులు దళిత వర్గానికి చెందినందుకు తనను ఆహ్వానించకుండా అవమానించారంటూ గ్రామా సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేసినట్లుగా ఆ వార్త సారాంశం. ఈ వార్త వెనుక నిజానిజాలు తెలుసుకునేందుకు విశ్వ సంవాద కేంద్ర తెలంగాణ విభాగం ప్రయత్నం చేసింది.
ఇందుకోసం ఒక నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసి పలువురి ద్వారా వివరాలు స్వీకరించింది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన బాణాల నాగరాజును అందించిన వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
1. గ్రామ సర్పంచ్ రాజమణి క్రైస్తవురాలు, క్రమం తప్పకుండా చర్చికి వెళ్లే సర్పంచ్ ఎప్పుడూ హిందూ పండుగలకు ఉత్సవాలకు హాజరుకాలేదు.
2. సర్పంచ్ తప్ప ఆ గ్రామంలోని ప్రజలంతా కులాలకు (ఎస్సీ వర్గాల ప్రజలతో సహా) అతీతంగా శ్రీరామనవమి ఉత్సవంలో పాల్గొన్నారు.
3. ఉత్సవంలో పాల్గొనమని ఆలయ కమిటీ నుండి ఎవరికీ కూడా వ్యక్తిగతంగా ఆహ్వానం లేదు. ఎవరికి వారు తమ బాధ్యతగా ఇందులో పాల్గొనే సంప్రదాయం ఆ గ్రామంలో ఉంది.
4. ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తల నేపథ్యంలో రామాలయ కమిటీ సభ్యులు, గ్రామస్థులు కలిసి సర్పంచితో చర్చలు జరిపారు.
5. రాబోవు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల దృష్ట్యా వేసిన రాజకీయ ఎత్తుగడగా గ్రామస్తులు పేర్కొన్నారు. (సర్పంచ్ ప్రధాన రాజకీయ ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ నాయకుడు ఆ ఆలయ కమిటీ సభ్యులు కూడా).