Home News కరోనాపై పోరుకు భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ చేయూత

కరోనాపై పోరుకు భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ చేయూత

0
SHARE

ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న ప్రాణాంతక కరోనా మహమ్మారిపై భారత ప్రభుత్వం సాగిస్తోన్న పోరుకు దేశీయ రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (DRDO) తోడ్పాటునందిస్తోంది. 
 తమ సంస్థ కరోనా వైరస్ వ్యాప్తిని నివారించేందుకు ఎన్-99 మాస్కులు, శరీరాన్ని కప్పివుంచే సూట్లతో పాటు అత్యవసర సమయాల్లో ఉపయోగించే వెంటిలేటర్లు, చేతులు శుభ్రం చేసుకునే శానిటైజర్లు కూడా తయారుచేసినట్టు ఒక ప్రకటనలో తెలియజేసింది. 

ఈ సందర్భంగా డీఆర్డీవో ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. “భారతదేశంలో కరోనా వ్యాప్తిని నివారించడానికి  కృషిచేయాలని మార్చి మొదటి వారంలో డీఆర్డీవో సంకల్పించింది. అప్పటికి, భారతదేశంలో కరోనా బాధితుల సంఖ్య 30 దాటింది. ఇప్పటిదాకా సుమారు 4 వేల లీటర్ల శానిటైజర్ ద్రావకాన్ని ఆర్మీ బలగాలకు చేరవేశాం. వాటిలో 1500 లీటర్లు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖకు, 500 లీటర్లు పారా మిలిటరీ బలగాలకు, 500 లీటర్లు భద్రతా రంగంలోని వివిధ విభాగాలకు చేరవేయడం జరిగింది. అంతేకాకుండా ఢిల్లీకి చెందిన పోలీస్ విభాగంలోని 40 అవుట్ పోస్టులకు కూడా శానిటైజర్ ద్రావకాన్ని పంపడం జరిగింది.” అని తెలియజేశారు. 

అత్యవసర పరిస్థితులకు ఉపయోగపడే వెంటిలేటర్ల తయారీలో కూడా డీఆర్డీవో పాలుపంచుకుంటోంది. ఇందుకు అత్యాధునిక టెక్నాలజీని వినియోగిస్తోంది. ఒకేసారి ఒకరు కన్నా ఎక్కువ మంది రోగులకు ఉపయోగపడే విధమైన వెంటిలేటర్లను అభివృద్ధి చేస్తోంది.