Home Rashtriya Swayamsevak Sangh కరోనా కథలు: ఇవ్వడానికి పెద్ద మనసు ఉండాలికానీ డబ్బు కాదు

కరోనా కథలు: ఇవ్వడానికి పెద్ద మనసు ఉండాలికానీ డబ్బు కాదు

0
SHARE
Image Courtesy: ww.tni.org

కర్నాటకలోని భాగల్ కోటి నగరంలోని ఒక వీధి. అక్కడ మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఉంటారు. నెలంతా కష్టపడితే వచ్చే సంపాదనపైనే ఆధారపడి జీవించే వారే. అలా కష్టపడి సంపాదించి కొంచెం కొంచెం కూడబెట్టుకున్న డబ్బుతో పాటు, మరికొంత అప్పు చేసి మరీ ఈ కరోనా సమయంలో ఇంటిని నడిపిస్తున్నారు.

ప్రేరణదాయకమైన సంఘటన

లాక్ డౌన్ సమయం లో చాలా మంది చాలా కష్టపడ్డారు. అక్కడే ఉన్న ఒక మహిళా ఇంటి పరిస్తితి చాలా దుర్భరంగా మారింది.  ఇల్లు గడవడం కష్టమైంది. తల్లిదండ్రులుగానీ, అన్నదమ్ములుగానీ సహాయం చేసే స్థితిలో లేరు.  బంధువుల నుంచి అలాంటి ఆశ అసలే లేదు.  చుట్టుపక్కలవారిని అడగడానికి ఆత్మాభిమానం అడ్డొచ్చేది. చాలా నరకయాతన అనుభవించేది ఆ ఆడపడుచు. అయినా ఆమె తన ధైర్యాన్ని విడిచిపెట్టలేదు. ఆ స్థితిలోకూడా ఎదుటివారి కష్టాలు తన కష్టాలుగా భావించి సహాయం కోసం వచ్చిన వారిని ఎప్పుడూ వట్టి చేతులతో పంపలేదు.

ఈ లాక్ డౌన్ పరిస్థితుల్లో ఆమె ప్రతి నిత్యం పనికి వెళ్లాలి. పోలీసుల నుండి తప్పించుకుని వెళ్ళాలి. 38 -42 డిగ్రీల ఎండలో రెండు కిలోమీటర్ల దూరం నడిచి వెళ్లి రావడం, పొరపాటున పోలీసుల కళ్ళల్లో పడితే తిట్టించుకోవాలి. కాని తప్పని పరిస్థితి. ఇలా ప్రతి రోజూ ఒక యుద్దానికి వెళ్లినట్టుగా ఉండేది ఆమె పరిస్థితి.

తరువాత ఆమె కష్టాలు తెలిసీ ఏమీ అనేవాళ్ళు కాదు. ఇన్ని కష్టాలు పడి ఇంటికి రాగానే ఇంట్లో పని. ఇంట్లో కొంచెం తక్కువైనా ఫరవాలేదు అవసరం వున్నవాళ్ళకు సహాయం చెయడానికి సిధ్ధం అయింది.

అదే సమయంలో తన పుట్టినరోజు కూడా వుండడంతో  తనకు చేతనైన సహాయం చెయడానికి సిధ్ధపడినది. ఆయితే ఈ విషయం తెలిసి చుట్టుపక్కల వాళ్లు ఒప్పుకొరని తనే సరైనవాళ్ళకు తాను ఇవ్వదలుచుకున్నది అందించాలనుకుంది.

సేవా కార్యక్రమాల్లో నిమగ్నమైన స్వయంసేవకుల గురించి విని వాళ్ళల్లో ఎవరికైనా డబ్బు ఇవ్వాలని అనుకుంది. రెండు రోజుల ప్రయత్నం తరువాత ఆ వ్యక్తి దొరికాడు. తక్షణమే ఆమె  దాచుకొన్న డబ్బు అతని చేతిలో పెట్టి అలాగే వెళ్లిపోయింది. ఆ స్వయం సేవకునికి ఆశ్చర్యం వేసింది. ఎవరీమె? ఎందుకు ఈ డబ్బు ఇచ్చినది? ఎవరి కోసం?

తరువాత కొంతసేపటి ఫోన్ చేసి డబ్బు అవసరమైన పేద వాళ్ళ   సహాయం కోసం ఉపయోగించమని చెప్పింది. ఆమె సేవాభావానికి అతనికి తెలియకుండానే ఆనందబాష్పాలు రాలాయి. ఉన్న చోటు నుంచే ఆమెకు వందనం చేసాడు. ఆమె ఇచ్చిన డబ్బు 5500 రూపాయలు. ఇది ఆమె ఒక నెల కష్టపడి సంపాదించిన డబ్బు. కొంచెమే అయినా ఆమె సేవాభావం చాలా గొప్పది. తను సంపాదించిన డబ్బు ఇచ్చేస్తే మరి మీకు అని అడిగితే నాకు దేవుడున్నాడు, మీలాంటి స్వయంసేవకుల ముందు నా సేవ గొప్పది కాదు అంటుంది. ఏదో సేవ చేశాననే గర్వం ఆమెకు కొంచెం కూడా లేదు.

ఆమె పేరు, అడ్రస్, ఫొటో  మిగతా వివరాలు అడిగితే చెప్పడానికి నిరాకరించింది. అంతే కాకుండా ఇంకా నా నుండి మీకు ఏదైనా సహాయం అవసరం అయితే ఏ సమయం అయినా తెలియజేయండి నాకు చేతనైనది తప్పకుండా చెస్తాను అని మాట కూడా ఇచ్చినది.  ఇది చాలదా ఆ స్వయం సేవకునికి తన సేవా భావం పెంచుకోవడానికి. తన కష్టాన్ని మరిచి ఎదుటివారి కష్టానికి స్పందించే గుణమున్న ఈమెకు మంచి జరగాలని, ఆ సేవాభావం ఎదుటివారికి ప్రేరణ కావాలని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు.

సమాజంలో ఈ విధమైన వ్యక్తులు, అందులోనూ స్త్రీలు నిజంగా భారత మాత అవతారం.

“యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా”

(ఎక్కడ స్త్రీలు పూజింపబడుతారో అక్కడ దేవతలు కొలువుంటారు)

..అనే శ్లోకం నిజమే అనిపిస్తుంది. ఈ విధంగా కరోనా బాధితులకు సేవ చేస్తున్న మాతలందరికీ, అలాగే ఈ ప్రేరణ దాయకమైన ఆడపడుచుకూ అనంత కోటి ధన్యవాదాలు.