Home News జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో క‌మ‌ల వికాసం

జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో క‌మ‌ల వికాసం

0
SHARE

జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో బీజేపీ పార్టీ త‌న స‌త్తా చాటుకుంది. మొత్తం 150 స్థానాల్లో 48 స్థానాల‌ను బీజేపీ కైవ‌సం చేసుకుంది. డిసెంబ‌ర్ 1న జ‌రిగిన జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో డిసెంబ‌ర్ 4న వెలువ‌డిన ఫ‌లితాల్లో 150 డివిజన్లకు గాను.. 149 డివిజన్ల ఫలితాలు వెలువడ్డాయి. టీఆర్ఎస్ 55, బీజేపీ 48, ఎంఐఎం 44 స్థానాలను గెలిచింది. కాంగ్రెస్ రెండు సీట్లకే పరిమితమయింది. ఇక నేరెడ్‌మెట్ ఫలితాన్ని రిటర్నింగ్ అధికారి నిలిపివేశారు. స్వస్తిక్ ముద్ర కాకుండా ఇతర ముద్ర ఉన్న ఓట్లు.. మెజారిటీ కంటే ఎక్కువ ఉన్నందున నిలిపేశారు. హైకోర్టు తీర్పు తర్వాతే ఆ ఫలితాన్ని ప్రకటించే అవకాశముంది. ఈ ఎన్నికల్లో అత్యద్భుతమైన ప్రదర్శన కనిబరిచింది బీజేపీ. 2016లో 4 సీట్లు గెలిచిన బీజేపీ ప్రస్తుతం 48 సీట్లు సాధించింది. ఈ విజయాన్ని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం, తెలంగాణ డీజీపీలకు అంకితం చేస్తున్నామని బీజేపీరాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారానికి వచ్చిన అమిత్ షా, యోగి సహా ముఖ్య నేతలకు బండి సంజయ్ కృతజ్ఞతలు చెప్పారు. సర్జికల్ స్ట్రైక్ చేస్తామని చెప్పిన తాము ఎన్నికల్లో శాఫ్రాన్ స్ట్రైక్ (కాషాయ దాడి) చేశామన్నారు. బీజేపీ రాజకీయాలపై విశ్వాసం ఉంచి తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు చెబుతున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. జేపీ నడ్డా, బండి సంజయ్ అద్భుతంగా పనిచేశారని కొనియాడారు.