మదర్సాలను రద్దు చేస్తూ అస్సాం రాష్ట్ర కెబినేట్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర కెబినేట్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ బిల్లును రాబోయే అసెంబ్లీ సమావేశంలో ప్రవేశపెట్టనున్నట్టు పేర్కొంది.
అస్సాంలో 600 మంది మదర్సాలను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు అస్సాం విద్యా శాఖ మంత్రి హిమంత బిస్వా శర్మ గత నెలలోనే ఒక మీడియా సంస్థకు వెల్లడించారు. మదర్సాలను సాధారణ విద్య కోసం మార్చాలని నిర్ణయించుకున్నామని, వీటిలో ఆధునిక విద్యను అందించబోతున్నామని తెలిపారు. ఇందుకోసం రూ.300 కోట్లు ఖర్చు చేయనున్నట్టు ఆయన తెలిపారు. మదర్సా విద్యను విద్యార్థులు స్వయంగా వ్యతిరేకిస్తున్నారని విద్యా మంత్రి చెప్పారు.
అస్సాంలోని మదర్సాల్లో విద్యార్థులకు ఇస్లాం, ఖురాన్ ఆధారంగా విద్యను అందిస్తే మంచి మార్కులు సాధించే అవకాముంటే ఇతర మతాలకు చెందిన మతగ్రంథాలను కూడా అనుమతిస్తే వారు కూడా మంచి మార్కులు సాధిస్తారని , కానీ దీని వల్ల విద్యార్థులు అసలైన విద్య అందక నష్టపోతారని, అందరికి సమాన విద్య కల్పించాలంటే విద్యా వ్యవస్థలో ఖురాన్‌ను తొలగించాలని ఆయన అన్నారు. అస్సాంలో మిశ్రమ సంస్కృతి ఉందని, అనేక చిన్న మతాలు ఉన్నాయని, కాబట్టి విద్యా వ్యవస్థలో సమానత్వాన్ని పెంపొందించడానికి ఖురాన్‌లోని విషయాన్ని తొలగించి మదర్సాలను రద్దు చేయడమే మంచి మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు.
మరో వైపు సంస్కృత పాఠశాలను కూడా రద్దు చేసి సంస్కృత విశ్వవిద్యాలయానికి అప్పగిస్తానని, వాటిని భారతీయ సంస్కృతిపై విద్యా అభ్యాస, పరిశోధన కేంద్రాలుగా మారుస్తామని శర్మ గతంలో గువహతిలో విలేకరులతో చెప్పారు.
Source : IndianExpress