Home News విజ‌య‌వాడ‌లో సీతమ్మవారి విగ్రహం ధ్వంసం

విజ‌య‌వాడ‌లో సీతమ్మవారి విగ్రహం ధ్వంసం

0
SHARE

ఆంధ్రప్రదేశ్ లో వ‌రుసగా హిందూ దేవీదేవతల విగ్రహాలపై దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అలాంటిదే మరో ఘటన విజయవాడ నడిబొడ్డున చోటుచేసుకున్నది. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ లో ఉన్న ఆటో స్టాండ్ ను ఆనుకుని ఉన్న శ్రీ సీతారామ మందిరంలోని సీతమ్మ వారి విగ్రహాన్ని కొందరు దుండగులు ధ్వంసం చేశారు.
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నిత్యం ఏదోక చోట ఈ విధంగా హిందూ దేవీదేవ‌త‌ల విగ్ర‌హాలపై దాడులు జ‌ర‌గ‌డంతో హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ ఉదాసీనత వల్లే ఇలాంటి సంఘటనలు రాష్ట్రంలో పదే పదే చోటుచేసుకుంటున్నాయని వారు ఆరోపిస్తున్నారు. సంఘటన గురించి తెలిసిన వెంటనే విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ కార్యకర్తలు హుటాహుటిన ఘటనాస్థలిని చేరుకుని ఆందోళ‌న చేప‌ట్టారు. విషయం తెలుసుకుని అక్కడికి చేరుకున్న పోలీసులు హిందూ సంఘాల నాయ‌కుల‌కు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. జరుగుతున్న ఘటనలకు కారకులైన వారిని గుర్తించి వారిని కఠినంగా శిక్షించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Read: ఆంధ్రప్ర‌దేశ్‌లో మ‌రో రెండు చోట్ల విగ్ర‌హాల ధ్వంసం

Read:  ఏపీ: పురాత‌న రాముడి విగ్ర‌హం ధ్వంసం…  కొల‌నులో విగ్ర‌హ శ‌క‌లం ల‌భ్యం