Home News క్రైస్తవ మతోన్మాదుల అనైతిక ప్రవర్తనను ప్రశ్నించినందుకు కేసు! 

క్రైస్తవ మతోన్మాదుల అనైతిక ప్రవర్తనను ప్రశ్నించినందుకు కేసు! 

0
SHARE
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మితిమీరిపోతున్న క్రైస్తవ మతోన్మాదానికి నిదర్శనం ఈ ఘటన. అత్యంత అనైతికంగా హిందువుల మందిరాల వద్ద క్రైస్తవ ప్రార్ధనలు ఏర్పాటు చేయడాన్ని ప్రశ్నించినందుకు హిందువులపై కేసు నమోదైంది.
వివరాల్లోకి వెళితే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని గుంటూర్ జిల్లాలో కొండ‌వీడు కొండ‌ల‌పై కొలువుదీరిన శ్రీ ల‌క్ష్మి న‌ర్సింహ‌స్వామి ఆల‌య ప్రాంగణంలో మొన్న డిసెంబ‌ర్ 31న కొంద‌రు వ్య‌క్తులు క్రైస్తవ ప్రార్ధనలు ఏర్పాటు చేసారు. ఐతే ఈ అనైతిక చర్యను అక్క‌డి స్థానికులు ప్రశ్నించే ప్రయత్నం చేయగా, క్రైస్తవ ప్రచారకులు తిరిగి వీరిపైనే బెదిరింపులకు పాల్పడిన వీడియోను కొందరు సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసి, అన్యాయాన్ని ప్రశ్నించడంతో ఈ విషయం వైరల్ అయ్యింది. ఒకరి ప్రార్ధనా మందిరం వద్ద మరొక మతానికి చెందిన వారు ప్రార్ధనలూ చేస్తూ, ప్రశ్నించిన వ్యక్తులను బెదిరించిన ఈ వీడియో చూసి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే.. మ‌త విద్వేషాలు రెచ్చ‌గొట్టే విధంగా వీడియోలు సోష‌ల్ మీడియాలో పెట్ట‌డం నేర‌మంటూ, ఈ విష‌యంపై కేసు న‌మోదు చేశారు గుంటూరు జిల్లా పోలీసులు! పోస్టు పెట్టిన వారిని గుర్తించేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్టు పోలీసులు తెలిపారు.

హిందూ దేవాల‌యం ద‌గ్గ‌ర అన్య‌మ‌త ప్ర‌చారం చేయడం ద్వారా మత ఉద్రిక్తతలు సృష్టించిన వ్యక్తులపై కాకుండా, దాన్ని సోష‌ల్ మీడియా ద్వారా ప్రశ్నించిన వారిపై కేసు న‌మోదు చేయ‌డం ప‌ట్ల ప్రజలు తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. అన్య‌మ‌త ప్ర‌చారం చేస్తున్న వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, అలాగే రాష్ట్రంలో దేవాల‌యాల‌పై జ‌రుగుతున్న దాడుల‌ను ఆరిక‌ట్టాల‌ని  హిందువులు డిమాండ్ చేస్తున్నారు.