Home News విద్యార్థుల సర్వతోముఖమైన వికాసానికి విద్యభారతి కృషి

విద్యార్థుల సర్వతోముఖమైన వికాసానికి విద్యభారతి కృషి

0
SHARE

విద్యార్థుల సర్వతోముఖమైన వికాసానికి విద్యభారతి కృషి  చేస్తున్న‌ద‌ని విధ్యభారతి  ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ ఆరావ్ కర్ బుధ‌వారం ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. విద్యభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థాన్ క్రింద దేశం మొత్తంలో పాఠశాలలు నడుస్తున్నాయ‌ని,  వీటిలో అందించే సంస్కారయుతమైన ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య గురించి అనేక సందర్భాల్లో అనేక మంది విద్యనిపుణులు, సామాజిక కార్యకర్తలు ప్రశంసించార‌ని పేర్కొన్నారు. జాతి, భాష, మత, సంప్రదాయ తేడాలు లేకుండా దేశభక్తి, సమాజం పట్ల అంకితభావం కలిగిన సంస్కారయుతమైన వ్యక్తులను తయారుచేయడమే విద్య‌భార‌తి లక్ష్యం అని స్ప‌ష్టం చేశారు. తక్కువ ఫీజులతో ఉన్నతమైన, విద్యను అందించడం ద్వారా బాల, బాలికల ల‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడానికి, వారిని చైతన్య వంతుల్ని చేయ‌డానికి విద్యభారతి నిరంత‌రం కృషి చేస్తున్నది ఆయ‌న పేర్కొన్నారు.

విద్య‌భార‌తి సంస్థ క్రింద పనిచేసే పాఠశాలలన్నింటికి గుర్తింపు పొందిన సమితులు ఉన్నాయ‌ని ఆయ‌న పెర్కొన్నారు. ప్రతి సంవత్సరం ఆదాయ వ్యయ లెక్కలు, ఆడిట్ తప్పకుండా జరుగుతాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు. క్రమం తప్పకుండా ప్రతీ సంవత్సరం వీటిని ప్రభుత్వానికి సమర్పించడం కూడా జరుగుతోందని ఆయన తెలిపారు.

సామాజిక సమరసత, అన్నీ మతాలను సమానంగా గౌరవించడం వంటివి విద్యా భారతి పాఠశాలల్లోని విద్యార్థులకు  అలవాటు చేయడం జరుగుతోంద‌ని ఆయ‌న పేర్కొన్నారు.  విద్య‌భార‌తి పాఠశాల్లో 80వేల మందికి పైగా ముస్లిం, క్రైస్తవ విద్యార్ధులు కూడా ఉన్నార‌ని పేర్కొన్నారు. వీరు చదువుల్లోనే కాక  ఆటల్లో కూడా మంచి ప్రతిభా పాఠ‌వాలు చూపుతూ పాఠశాలలకు పేరు తెస్తున్నార‌ని ఆయ‌న పేర్కొన్నారు.