తమిళనాడు, పెరంబలూర్ జిల్లాలోని వి కలతూర్ గ్రామంలో గత కొన్నేండ్లుగా గ్రామస్తులు నిర్వహిస్తున్న ఆలయ ఊరేగింపులపై స్థానిక ముస్లింలు అభ్యంతరం తెలుపుతూ దాఖలైన పిటిషన్ విచారణ సమయంలో జస్టిస్ ఎన్ కిరుబకరన్, పి వెల్మురుగన్ తో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.ఈ కేసులో ప్రతివాదిగా ఉన్న డిప్యూటీ సూపరింటెండెంట్ సమర్పించిన అఫిడవిట్ లోని వివరాల ప్రకారం.. పెరంబలూర్ జిల్లా కలతూర్ గ్రామంలో ఎన్నో సంవత్సరాలుగా మూడు రోజుల పాటు దేవాలయ ఉత్సవాలు ఘనంగా జరుగుతూ వస్తున్నాయి. దీంతోపాటు గ్రామంలో ఊరేగింపు కూడా ఉంటుంది. 2011వ సంవత్సరం వరకు శాంతియుతంగా జరిగిన ఈ ఉత్సవాలను 2012 సంవత్సరం స్థానిక ముస్లింలు అడ్డుకోవడం ప్రారంభించారు.
జిల్లా మున్సిపాలిటీ చట్టం 1920 లోని సెక్షన్ 180-ఎ ప్రకారం రోడ్లు లేదా వీధుల్లో మతం, కులం అనే తేడా లేకుండా ఉత్సవాలకు, ఊరేగింపులు నిర్వహించడానికి ప్రజలకు ప్రవేశం కల్పించాలన్న నిబంధన ఉన్న విషయాన్ని కోర్టు గుర్తు చేసింది.
“ఒక మతానికి చెందిన వారు నిర్దిష్ట ప్రాంతంలో ఆధిపత్యం చెలాయిస్తున్నందున, మతపరమైన పండుగలను జరుపుకోవడం లేదా ఆ రహదారుల గుండా ఇతర మత సమూహాల ఊరేగింపులను నిషేధిండం సరి కాదని ” అని న్యాయస్థానం పేర్కొంది.
మతపరమైన అసహనాన్ని చూస్తూ ఊరుకోవడం లౌకిక దేశానికి మంచిది కాదని దేశంలో అసహనం తగ్గాలని లేదా పూర్తిగా తొలగిపోవాలని కోర్టు అభిప్రాయపడింది.
Source : New Indian Express