Home News బెంగాల్లో జరుగుతున్నది హింస కాదా?

బెంగాల్లో జరుగుతున్నది హింస కాదా?

0
SHARE

దృతరాష్ట్రుడు విదురుని సలహాను పాటించిఉంటే మహాభారత యుద్ధం జరిగేది కాదు.  కానీ పుత్రవ్యామోహంతో కళ్లుమూసుకుపోయిన  దృతరాష్ట్రునికి విధురుని మాటలు చెవికెక్కలేదు. వాటిని లెక్కచేయలేదు. కానీ దానివల్ల అలా మహాత్మాడైన విదురుని మాటల విలువ ఏమీ తగ్గలేదు, తగ్గదు.  అప్పుడు ధృతరాష్ట్రుడికి  మంచి చెడులు చెప్పడానికి విదురుడు ఉన్నాడు. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులు. అలాంటి ప్రజలకు నిజాన్ని చూపించే బాధ్యత ‘మీడియా’ పైన ఉంది. కానీ అదే మీడియా భయం, దురాశ, స్వార్థం, వ్యామోహం వల్ల నిజాన్ని దాచిపెడితే ప్రజాస్వామ్యం ఎలా బ్రతికిబట్టకట్టగలదు? ఈ రోజు బెంగాల్ పట్ల మీడియా వ్యవహారిస్తున్న తీరు ఇలాంటిదే కాదా?

మమతా బెనర్జీ గెలుపు తర్వాత బెంగాల్ లో భయంకరంగా హింస జరుగుతున్నది. స్వయంగా ముఖ్యమంత్రే  16 హత్యలు జరిగాయని ఒప్పుకుంది.  కానీ ఈ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని వేర్వేరు ఘటనల ద్వారా తెలుస్తున్నది. భాదితులలో ఎక్కువగా విపక్షంలోని బీ.జె.పీకి చెందిన కార్యకర్తలేనని తెలుస్తుంది. కేంద్ర మంత్రుల కాన్వాయ్ పైనే దాడులు జరుగుతున్నాయి. కానీ దేశ విదేశాల ప్రధాన మీడియా మాత్రం ఏమీ జరగనట్లు నిద్ర నటిస్తున్నాయి. ఒకవేళ ఇవే ఘటనలు యోగీ ఆదిత్యనాథ్ సారథ్యంలోని ఉత్తరప్రదేశ్ లో జరిగిఉంటే ఈపాటికి వార్తా పత్రికలు, టీవీ ఛానెల్లు హైడ్ లైన్లతో జనాలను ఊదరకొట్టేవి.  ప్రజాస్వామ్యం చచ్చి పోయిందని శోకాలు పెట్టేవి. కానీ బెంగాల్ లో ఈ విధంగా ఎందుకు జరగడం లేదు? ఇది భాధతో పాటు లోతుగా ఆలోచించాల్సిన విషయమే.

అఖండ మెజారిటీతో గెలిచిన ఒక పార్టీ విపక్షాల పట్ల ఇట్లా హింసకు పాల్పడితే అది ఖచ్చితంగా భారత ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు. గతంలో ఇదే మమతా బెనర్జీకి చెందిన తృణమూల్  పార్టీ వారు వామపక్ష పార్టీ కార్యకర్తలు తమపై దాడులు చేస్తున్నారని అనే ఆరోపణలు చేసేవారు. కానీ ఇప్పుడు జరుగుతున్న హింస అత్యంత పాశవికంగా, పెద్దఎత్తున సాగుతోంది. ప్రస్తుతం బెంగాల్ నుండి వస్తున్న వార్తలు, అందుకు సంబంధించిన వీడియోలు అత్యంత దారుణంగా, ఎంతో బాధను, కోపాన్ని కలిగించే విధంగా ఉన్నాయి.

ఈ పరిణామాలను గమనిస్తూ ఉంటే నేటి తృణమూల్ కాంగ్రెస్ అధినాయకత్వం మహాభారతంలోని ‘దృతరాష్ట్రుని’ వలె కళ్ళు మాత్రమే కాకుండా చెవులు సైతం మూసుకున్నట్టు ఉంది. కానీ స్థానిక, విదేశీ మీడియాతో పాటు `మేధావి వర్గం’గా తమనుతాము పిలుచుకునే  బుద్ధిజీవులైనా విదురుని పాత్ర పోషించవచ్చును కదా ? అలా చేయకుండా వారిని ఎవరు నిర్బందిస్తున్నారు?

ఏ చిన్న సంఘటన జరిగినా దానిని భూతద్దంలో చూపించే ఒక పెద్ద సమూహమే దేశంలో ఉంది. వారు మానవాధికారాలు, హక్కులు,  మానవత్వం, సుప్రీంకోర్టు, ప్రజాస్వామ్యం లాంటి చిలకపలుకులు పలుకుతూ ఉంటారు. తీవ్రవాదులను విడిపించడానకి రాత్రికి రాత్రే సుప్రీంకోర్టు తలుపులు తడతారు. కానీ  బెంగాల్ హింస గురించి వీళ్ళేవారు మాట్లాడటం లేదేందుకు? కోర్టుల దగ్గరకు పరుగులు తీయడంలేదేందుకు?  ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి జరుగుతున్న  హింస పట్ల కానీ, మహిళల పై జరుగుతున్న అత్యాచారాలు, హత్యల గురించి ప్రజాహక్కుల, అభ్యుదయవాదుల గుండెలు ఎందుకు కరగడం లేదు?  ప్రజల మానవాధికారాలు, వారి జీవిత హక్కులు వారి రాజకీయ కోణం దృష్టితో  ముడిపడి ఉంటాయా? ఈ విషయమై ఈ మేధావులు, దేశ, విదేశీ మీడియా పాత్ర పట్ల అనేక ప్రశ్నలు కలుగుతున్నాయి.

ఢిల్లీలో జరిగిన అల్లర్లు, అఖలఖ్ హత్యోదంతం లాంటి అనేక ఘటనల జరిగినపుడు మీడియా తమ భుజానికి ఎత్తుకొని వీటిని ప్రముఖ వార్తలు, శీర్షికలలో పెట్టి కోర్టులు, జాతీయ, అంతర్జాతీయ సమాజపు దృష్టికి తెచ్చింది.  కానీ అలాంటి మీడియా బెంగాల్ లో జరుగుతున్న హింసాత్మక ఘటనలకు అంతే ప్రాధాన్యత ఇస్తున్నదా? ఇతర సంఘటనలను లేవనెత్తినట్లుగా ఈ ప్రధాన వార్తాపత్రికలు, మీడియా ఛానళ్ళు బెంగాల్ ఘటనను కూడా అంతే సీరియస్ గా లేవనెత్తుతున్నాయా?

Read Also: హత్యలు, దోపిడి, మహిళలపై మానభంగాలతో అట్టుడుకుతున్న బెంగాల్

కొన్ని వార్తా పత్రికలు అయితే, ఇలాంటి హింసాత్మక ఘటనలకు సందేహాత్మకంగా ప్రచురిస్తున్నాయి. దీంతో అక్కడ వాస్తవానికి ఏం జరుగుతుందో ఆర్థం కాని పరిస్థితి నెలకొంది. ఎన్నికల తర్వాత బెంగాల్ లో జరుగుతున్న ఈ రాజకీయ ప్రేరేపిత హింసను గురించి చెప్పడానికి ఇన్ని అనుమానాలతో ఒక విధమైన సంశయాత్మక రిపోర్టింగ్ చేయడమనేది అలాంటి వార్తలలో నిస్పక్షపాత, సంతులన వైఖరిని పాటించడం  కోసమేనని అంటున్నారు. మరి మిగిలిన సంఘటనలలో కూడా ఆ నిస్పక్షపాత వైఖరి ఏమైంది? అప్పుడు హెడ్ లైన్లు, రిపోర్టింగ్ ఎందుకు ఏకపక్షంగా ఉంది?

బెంగాల్ లో జరుగుతున్న హింసను. ఎటువంటి రాజకీయ, మత పరమైన పక్షపాతం లేకుండా దేశ ప్రజల ముందు  ఉంచే బాధ్యత జాతీయ, అంతర్జాతీయ మీడియాపై  ఉంది. అల్లర్లకు  ప్రేరేపించే వారిని జనం ముందు నిలబెట్టాల్సిన అవసరం ఉంది. ఈ హింస వెనుక ఉన్నది ఎవరో,  ఎవరు హింసకు ప్రేరేపిస్తున్నారో వారి ముసుగును తొలగించాలి. ఇలాంటి విషయాలను మీడియా ఎలాంటి రాజకీయ కళ్ళద్దాలతో చూపెట్టకూడదు.

మహాభారత కాలంలో ధృతరాష్ట్రునికి మంచి చెడులను చెప్పడానికి కొంతమంది ఉండి వివరించే ప్రయత్నం చేసేవారు. కానీ ఇప్పుడు విదురుని రూపంలో ఉన్న మేధావులు, మీడియా కూడా దృతరాష్ట్రుని వలే తమ కళ్లకు గంతలు కట్టుకున్నారు. అంతే కాకుండా చెవుల్లో దూది సైతం పెట్టుకున్నారు.

Read also: బెంగాల్ హింస వెనుక కుట్ర: ఆర్.ఎస్.ఎస్

సుప్రసిద్ధ రచయిత భరతేందు హరిశ్చంద్ర ఒక నాటకాన్ని రచించారు. ఆ నాటకం శీర్షిక ‘వైదికి హింసా హింసాన భవతి”. అందులో కపట పురోహితుడు, మూర్ఖుడైన పండితుడు, దురాశ పరుడైన మంత్రి, జీవహింస శాస్త్ర సమ్మతమే అని సమర్ధిస్తారు. కానీ హింస సరికాదని హింసకు పాల్పడిన వారు చివరకు నరకానికి పోతారని నిరూపితమవుతుంది.

బెంగాల్ ఎన్నికలలో గెలిచిన తృణమూల్ కాంగ్రెస్ అధికార మదంతో తన కళ్లకు తానే గంతలు కట్టుకోవచ్చు. కానీ మీడియా ఇలా చేయరాదు. బెంగాల్ హింస భారత ప్రజాస్వామ్యానికి, సౌభ్రాతృత్వ భావానికి ఎంతో విఘాతమని గ్రహించాలి.

–ఉమేశ్ ఉపాద్యాయ, సీనియర్ జర్నలిస్ట్  

తెలుగు అనువాదం: యోగేష్ దేశాయ్

విజ్ఞ‌ప్తి : మా కంటెంట్ ఉపయోగకరంగా ఉందని భావించి ఈ పనిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఆర్ధికంగా సహకరించదలచిన దాతలు ఈ కింది లింక్ ద్వారా మీ విరాళాలను అందించవచ్చు. మీరు ఇచ్చే విరాళం ఎంతైనప్పటికీ మీ సహకారం మాకు విలువైనది, DONATE HERE