Home News మ‌తపరమైన అస‌హ‌నం మంచిది కాదు: హిందూ పండుగను అడ్డుకోవడంపై మ‌ద్రాస్ హైకోర్టు వ్యాఖ్యలు 

మ‌తపరమైన అస‌హ‌నం మంచిది కాదు: హిందూ పండుగను అడ్డుకోవడంపై మ‌ద్రాస్ హైకోర్టు వ్యాఖ్యలు 

0
SHARE
 అప్పటి వరకు ప్రతీ ఏడాది నిర్విరామంగా, ప్రశాంతంగా జరుగుతూ వస్తున్న హిందూ ఊరేగింపు పండుగను ఆ మరుసటి ఏడాది నుండి ముస్లిములు మతపరమైన అభ్యంతరం లేవనెత్తి అడ్డుకోవడంపై మద్రాస్ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. మతపరమైన అసహనాన్ని ప్రోత్స‌హించ‌డం లౌకిక దేశ‌మైన భార‌త‌దేశానికి మంచిది కాదని మద్రాస్ హైకోర్టు పేర్కొంది. ఈ విధమైన అసహనం దేశంలో గందరగోళం, అల్లర్లకు దారితీస్తుంద‌ని కోర్టు స్ప‌ష్టం చేసింది.

తమిళనాడు, పెరంబలూర్ జిల్లాలోని ‌‌వి కలతూర్ గ్రామంలో గ‌త కొన్నేండ్లుగా గ్రామస్తులు నిర్వ‌హిస్తున్న ఆలయ ఊరేగింపుల‌పై స్థానిక ముస్లింలు అభ్యంత‌రం తెలుపుతూ దాఖ‌లైన పిటిష‌న్ విచార‌ణ స‌మ‌యంలో ‌జస్టిస్ ఎన్ కిరుబకరన్, పి వెల్మురుగన్ తో కూడిన‌ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.ఈ కేసులో ప్రతివాదిగా ఉన్న డిప్యూటీ సూపరింటెండెంట్ సమర్పించిన అఫిడవిట్ లోని వివరాల ప్ర‌కారం.. పెరంబలూర్ జిల్లా కలతూర్ గ్రామంలో ఎన్నో సంవ‌త్స‌రాలుగా మూడు రోజుల పాటు దేవాలయ ఉత్స‌వాలు ఘనంగా జరుగుతూ వస్తున్నాయి. దీంతోపాటు గ్రామంలో ఊరేగింపు కూడా ఉంటుంది. 2011వ సంవ‌త్స‌రం వరకు శాంతియుతంగా జ‌రిగిన ఈ ఉత్సవాలను 2012 సంవత్సరం స్థానిక ముస్లింలు అడ్డుకోవడం ప్రారంభించారు.

దీనికి వారు చెప్పిన కారణం.. హిందూ మ‌త సాంప్ర‌దాయాల ప్ర‌కారం జ‌రుగుతున్న ఉత్స‌వాలు మా ఇస్లాం సంప్రదాయాలకు విరుద్ధం కాబట్టి మేము ఒప్పుకోము అని  అభ్యంతరం చెప్పడం ప్రారంభించారు. దీంతో ఆలయ ఉత్సవాలు, ఊరేగింపులు నిర్వహించడానికి రక్షణ కోరుతూ హిందువులు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో కొన్ని షరతులతో కూడిన అనుమతులు ఇవ్వబడ్డాయి. 2012కి ముందు గ్రామంలోని అన్ని వీధుల గుండా ఆలయ ఊరేగింపులు జరిగాయని, అప్పుడు ఎటువంటి సమస్య లేదని న్యాయమూర్తులు గుర్తించారు. 2012 తర్వాత నుండి ఊరేగింపుకు అభ్యంతరాలు ఏర్పడ్డాయి.

జిల్లా మున్సిపాలిటీ చట్టం 1920 లోని సెక్షన్ 180-ఎ ప్రకారం రోడ్లు లేదా వీధుల్లో మతం, కులం అనే తేడా లేకుండా ఉత్స‌వాల‌కు, ఊరేగింపులు నిర్వ‌హించ‌డానికి ప్రజలకు ప్రవేశం కల్పించాలన్న నిబంధన ఉన్న విషయాన్ని కోర్టు గుర్తు చేసింది.

“ఒక మతానికి చెందిన వారు నిర్దిష్ట ప్రాంతంలో ఆధిపత్యం చెలాయిస్తున్నందున, మతపరమైన పండుగలను జరుపుకోవడం లేదా ఆ రహదారుల గుండా ఇతర మత సమూహాల ఊరేగింపుల‌ను నిషేధిండం సరి కాద‌ని ” అని న్యాయ‌స్థానం పేర్కొంది.

మతపరమైన అసహనాన్ని చూస్తూ ఊరుకోవడం లౌకిక దేశానికి మంచిది కాద‌ని దేశంలో  అసహనం త‌గ్గాల‌ని లేదా పూర్తిగా తొల‌గిపోవాల‌ని కోర్టు అభిప్రాయప‌డింది.

Source : New Indian Express

విజ్ఞ‌ప్తి : మా కంటెంట్ ఉపయోగకరంగా ఉందని భావించి ఈ పనిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఆర్ధికంగా సహకరించదలచిన దాతలు ఈ కింది లింక్ ద్వారా మీ విరాళాలను అందించవచ్చు. మీరు ఇచ్చే విరాళం ఎంతైనప్పటికీ మీ సహకారం మాకు విలువైనది, DONATE HERE