Home News ఆర్‌.ఎస్‌.ఎస్‌: కరోనా 3వ ద‌శ‌పై అవగాహనకు జన జాగరణ ఉద్యమం

ఆర్‌.ఎస్‌.ఎస్‌: కరోనా 3వ ద‌శ‌పై అవగాహనకు జన జాగరణ ఉద్యమం

0
SHARE

రోనా 3rd వేవ్ ను సమర్థంగా ఎదుర్కోవడానికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ దేశవ్యాప్తంగా తమ కార్యకర్తలకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించనున్నది. ఇలా శిక్షణ పొందిన కార్యకర్తలు దేశంలోని 2.5 లక్షల కేంద్రాలలో తమ సేవా కార్యక్రమాలను విస్తరించనున్నారు. ఇప్పటికే 27,166 శాఖల నుంచి దేశవ్యాప్తంగా వివిధ సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

మధ్యప్రదేశ్ లోని చిత్రకూట్ లో జరుగుతున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రాంత ప్రచారకుల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లుగా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ శ్రీ సునీల్ అంబేకర్ తెలిపారు. ఈ సమావేశంలో కరోనా 2nd వేవ్ నేపథ్యంలో నెలకొన్న పరిస్థితుల పైన, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా నిర్వహించిన వివిధ సేవా కార్యక్రమాల పైన సమీక్ష జరిగింది. వివిధ ప్రదేశాలలో నిర్వహించిన క్వారంటైన్ కేంద్రాలు, వ్యాక్సినేషన్ పై కార్యకర్తలు నిర్వహించిన అవగాహన కార్యక్రమాలపై కూడా సమీక్ష జరిగింది.

ఇప్పుడు 3rd వేవ్ ముప్పు పొంచి ఉన్నదని వార్తలు వినవస్తున్న దృష్ట్వా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ దేశవ్యాప్తంగా తమ కార్యకర్తలకు శిక్షణా కార్యక్రమాన్ని యోజన చేస్తున్నది. ఇలా శిక్షణ పొందిన కార్యకర్తలు ప్రభుత్వ అధికార వర్గాలకు, బాధితులకు తగిన సహాయ సహకారాలను అందిస్తారు. ఈ క్రమంలో శిక్షణ పొందిన కార్యకర్తలు దేశంలో సుమారు 2.5 లక్షల కేంద్రాలకు వెళ్ళి ప్రజలలో కరోనా పరిస్థితుల పట్ల అవగాహన కలిగిస్తారు. ఈ శిక్షణ కార్యక్రమం ఆగస్టులో పూర్తవుతుంది. సెప్టెంబర్ మాసానికి దేశంలోని వివిధ సంస్థలతో కలిసి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ జన జాగరణ ( Public awareness) కార్యక్రమాన్ని దేశంలోని అన్ని గ్రామాలు, నగరాలు, పట్టణ ప్రాంతాలలో నిర్వహించనున్నది. ఈ శిక్షణ కార్యక్రమంలో ప్రధానంగా మహిళలు, చిన్నారులు కరోనా బారిన పడకుండా ఉండడానికి అవసరమైన జాగ్రత్తలను గురించి వివరించడం జరుగుతుంది.

కరోనా పరిస్థితులు కొద్దిగా చక్కబడిన ప్రస్తుత పరిస్థితులలో దేశంలోని అనేక ప్రదేశాలలో సంఘ శాఖలు యదావిధిగా ప్రారంభమయ్యాయి. సమావేశంలో అందిన సమాచారం మేరకు దేశవ్యాప్తంగా 39,454 శాఖలు జరుగుతున్నాయి. వాటిలో 27,166 శాఖలు ఇప్పుడిప్పుడే మైదానంలో ప్రత్యక్షంగా ప్రారంభమవగా మిగిలిన 12,288 శాఖలు ఆన్లైన్ (E – Shakhas) లో జరుగుతున్నాయి. అలాగే ప్రస్తుతం జరుగుతున్న 10,130 సప్తాహిక్ మిలన్ (Weekly meeting) లలో 6510 ప్రత్యక్షంగా జరుగుతుండగా 3620 ఆన్ లైన్ (E – Milan) ద్వారా జరుగుతున్నాయి. అలాగే కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ప్రత్యేకంగా దేశ వ్యాప్తంగా ప్రారంభమైన కుటుంబం మిలన్ (Family meet) లు మొత్తం 9637 జరుగుతున్నాయని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఈ సందర్భంగా విడుదల చేసిన పత్రికా ప్రకటనలో తెలిపింది.