Home News VIDEO: స్వరాజ్య సమరాజ్ఞి రాణి గైడిన్లు

VIDEO: స్వరాజ్య సమరాజ్ఞి రాణి గైడిన్లు

0
SHARE

వెనకబడిన ప్రాంతానికి చెందిన రాణి గైడిన్లు పాఠశాలకు వెళ్ళలేదు. కాని స్వాతంత్ర్య స్ఫూర్తి నిండుగా ఉన్న ఆమె, బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొంది. 16 సంవత్సరాల వయస్సులో ఉద్యమానికి నాయకత్వం వహించింది. తన `జేలియనగ్రోంగ్’ వర్గాలను కూడదీసి, బ్రిటిషువారికి పన్నులు చెల్లించవద్దని కోరి, దేశ స్వాతంత్ర్యానికై పోరాడింది. ఆమె మాటమీద అన్ని నాగావర్గాలు, బ్రిటిష్ పాలకులను ఎదిరించి సహాయనిరాకరణ ప్రారంభించారు. దానితో బ్రిటిష్ పార్లమెంటు ఆమెపై `ఈశాన్య భారత ఉగ్రవాది’ అంటూ ముద్రవేసింది. జీవిత కారావాస శిక్ష విధించింది. నాగా సంప్రదాయ `హెరాకా’ మతాన్ని గైడిన్లు పునరుద్ధరించింది. రాణి గైడిన్లు పూనుకున్న నాగా సంప్రదాయ పునరుద్ధరణను నాగా చర్చ్ వ్యతిరేకించింది. ఇది క్రైస్తవానికి వ్యతిరేకమని ప్రచారం చేసింది.