Home News గోరఖ్‌పూర్ దేవాలయం దాడి: టెర్రరిస్టు యువతి నుంచి నిందితుడికి ఈ-మెయిల్స్

గోరఖ్‌పూర్ దేవాలయం దాడి: టెర్రరిస్టు యువతి నుంచి నిందితుడికి ఈ-మెయిల్స్

0
SHARE

ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో గోరఖ్‌పూర్ దేవస్థానం వద్ద ఇద్దరు పోలీసులపై దాడి చేసిన అహ్మద్ ముర్తజా అబ్బాసీ అరబిక్ పదాలతో కూడిన ఒక సంకేత భాషను వినియోగించేవాడని అతడిని విచారిస్తున్న ఉగ్రవాద వ్యతిరేక బృందం (ATS) వర్గాలు తెలిపాయి. ఉగ్రవాద మూక ఐసిస్ శిబిరానికి చెందిన ఒక యువతితో అబ్బాసీకి సత్సంబంధాలు ఉన్నాయి. ఈ-మెయిల్స్ ద్వారా సదరు యువతితో నిందితుడు పరిచయం పెంచుకున్నాడు. ఆమె ఇచ్చిన ఖాతాకు అనేక మార్లు అబ్బాసీ నగదు పంపించాడని ATS అధికారులు వెల్లడించారు.

‘అమర్ ఉజాలా’ లో వచ్చిన ఒక వార్తా కథనం ప్రకారం, తాను ఐసిస్ ఉగ్రవాద సంస్థలో చేరడానికి సన్నాహాలు చేసుకున్నట్టు విచారణ సందర్భంగా ATS అధికారులతో అబ్బాసీ అన్నాడు. అదే సమయంలో ఐసిస్‌కు ఒక యువతి నుంచి అతడికి ఈ-మెయిల్ వచ్చింది. ఆ యువతి తన ఫొటోను పంపించడానికి తోడు భారత్ వచ్చినప్పుడు కలుస్తానని అబ్బాసీకి మాట ఇచ్చింది. ఆమె అడిగిందే తడవుగా ఆమె చెప్పిన ఖాతాకు 40 వేల రూపాయలను ముర్తజా పంపించాడని అధికార వర్గాలు వెల్లడించాయి. అతడు 2017 నుంచి ఇంటర్నెట్‌లో కంప్యూటర్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవడం ప్రారంభించాడు. అక్కడి నుంచి అతడి ఆలోచనల్లో పెను మార్పులు సంభవించాయి. తాను స్వర్గంలో ఉన్నప్పటికీ అల్లా తన పట్ల అసంతృప్తిగా ఉన్నట్టు తాను భావిస్తున్నట్టు విచారణ సందర్భంగా నిందితుడు తెలిపాడని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

2020 సంవత్సరం జనవరి మాసం నుంచి అతడు హైటెక్ కంప్యూటర్ కోడింగ్ నేర్చుకోవడం ప్రారంభించాడు. అదే సమయంలో అతడు మరోసారి సిరియాకు చెందిన ఉగ్రవాద మూకలతో పరిచయం పెంచుకున్నాడు. వారికి తన నేపాలీ ఖాతాల నుంచి ఎనిమిది లక్షల రూపాయలను పంపించాడు. యావత్ ప్రపంచం ముస్లిములను వేధిస్తుందనే భావనలో తాను ఉన్నట్టు ముర్తజా తెలిపాడని ATS వర్గాలు తెలిపాయి. రాడికల్ భావజాలం, జిహాదీ మనస్తత్వం అతడి ఆలోచనా ధోరణిని సమూలంగా మార్చి వేసిందని వారు చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో అతడి నేపాల్ సరిహద్దుల్లో అనుమానిత మదరసాలకు వెళ్ళేవాడు. అక్కడి వారు చేసే ప్రసంగాలను వినేవాడు.

ముర్తజా పలు ఖాతాలను నగదు పంపించాడు. ముర్తజా ఇచ్చిన ఈ సమాచారంతో అతడి ఖాతాలోకి నగదు ఎక్కడి నుంచి వస్తున్నది? వచ్చిన నగదును దేనికి వాడుకున్నాడు? ఎంత మొత్తానికి ఇతరులకు పంపించాడు అనే వివరాలను సేకరించే పనిలో అధికారులు ఉన్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి.

అరబిక్ భాషకు చెందిన సంకేత పదాలతో అహ్మద్ ముర్తజా అబ్బాసీ మాట్లాడుతూ ఉండేవాడు. ముర్తజా నివాసం నుంచి జిహాదీ సాహిత్యాన్ని ATS అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో అరబిక్ భాషలోని పుస్తకం కూడా ఉంది. అధికారులు ముర్తజాతో పాటుగా ఆ పుస్తకాన్ని లక్నోలోని తమ ప్రధాన కార్యాలయానికి తీసుకొని వెళ్ళారని సంబంధిత వర్గాలు తెలిపాయి. క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఆ పుస్తకంలోని పలు పదాలు అండర్ లైన్ చేసి ఉన్నాయి.

ముర్తజా సంకేత పదాలు

దేశంలోని వారితో లేదా విదేశాల్లోని వారితో ఫోన్‌లో మాట్లాడుతున్నప్పుడు విమానం అనే పదానికి ‘రిహ్‌లత్ టయరన్’ అనే అరబిక్ పదాన్ని అతడు వాడుతుండేవాడు. పుస్తకంలోని ఆ పదాన్ని ముర్తజా మార్కర్ పెన్‌తో అండర్ లైన్ చేశాడని విచారణాధికారులు తెలిపారు. ముర్తజాను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ఇతరులు ‘అల్‌జిహాద్’ అనే అరబిక్ పదాన్ని వాడేవారు. అతడిని ఆత్మత్యాగం చేసే దిశగా స్వర్గం అనే పదాన్ని వారు సంభాషణల్లో వాడేవారు. ముర్తజాను జిహాద్ పథంలోకి చేర్చే క్రమంలో అతడి పేరును వినియోగించే వారు కాదని అధికారులతో నిందితుడు చెప్పినట్టు ATS వర్గాలు వెల్లడించాయి. అలాంటి సంభాషణల్లో ముర్తజాను అబ్దుల్లా అని సంబోంధించేవారు. వెలుపలి నుంచి అతడి దగ్గరకు వచ్చే వారికి సంకేత పదంగా ‘మెహ్మాన్’ ఉండేది. నిధుల సేకరణకు సంబంధించిన సంభాషణ జరిపేటప్పుడు దానికి బదులుగా ‘బక్షీష్’ అనే పదం వాడేవారు. పోలీసులు లేదా భద్రతా ఏజెన్సీలను ‘ఖట్మల్’ అంటే దోమలు అని సంబోంధించేవారమని విచారణ అధికారుల ఎదుట అహ్మద్ ముర్తాజా అబ్బాసీ వెల్లడించినట్టు ATS వర్గాలు తెలిపాయి.