Home News శోభాయాత్రలపై దాడులకు అంతం లేదా?

శోభాయాత్రలపై దాడులకు అంతం లేదా?

0
SHARE

సంఘమిత్ర

హనుమాన్ జయంతి రోజున ఢిల్లీలో జహంగీర్‌పురా దారుణమైన హింసాత్మక ఘటనలకు వేదికగా మారింది. శోభాయాత్ర చేపట్టిన హిందువులపై స్థానిక ముస్లిములు రాళ్ళు రువ్వారు. కాల్పులకు సైతం తెగబడ్డారు. మతకల్లోలంతో ఆ ప్రాంతం అట్టుడికిపోయింది.

జహంగీర్‌పురాలో హింస అనంతరం కొందరు లౌకికవాదులు బైటకు వచ్చారు. ఒక మసీదులోకి ప్రవేశించి కాషాయ పతాకాన్ని ఎగురువేయడానికి హిందూ భక్తులు ప్రయత్నించిన కారణంగానే హింస చోటు చేసుకుందని చెప్పుకొచ్చారు. ఇలా నిందను హిందువులపైకి నెట్టివేయడం గత వారంలో కూడా జరిగింది. శ్రీరామ నవమిని పురస్కరించుకొని అనేక రాష్ట్రాల్లో చేపట్టిన శోభాయాత్రల్లో హిందువులు రెచ్చగొట్టే పాటలను వినిపించినందుకే యాత్రపై రాళ్ళు రువ్విన ఘటనలు జరిగాయని హిందువులను నిందించారు నిర్దేశిత లౌకికవాదులు.

జహంగీర్‌పురా హింసలో హిందువులపై ముస్లిములు రాళ్ళు రువ్వుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ కారణంగానే ఈ ఘనత వహించిన లౌకికవాదులు కొన్ని కట్టుకథలతో ముందుకు వచ్చారు. ఒక మసీదులోకి దౌర్జన్యపూరితంగా ప్రవేశించి కాషాయ పతాకం ఎగురవేయడానికి ఒక హిందువుల బృందం ప్రయత్నించిందని వారు నమ్మబలికారు.

అయితే వారి కట్టుకథలను ఢిల్లీ పోలీసులు తిరస్కరించారు. జహంగీర్‌పురాలో హనుమాన్ జయంతి యాత్ర సందర్భంగా మసీదులో కాషాయ పతాకాన్ని ఎగురవేసే ఎలాంటి ప్రయత్నాలు జరగలేదని స్పష్టం చేశారు.

ఇటీవలి హింసాత్మక ఘటనలు కొత్తవేమీ కావు అలాగని ఒక ప్రాంతానికే పరిమితమైనవి కావు. కరౌలీలో, హిందూ నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ఊరేగింపుగా వెళుతున్న హిందువులపై ముస్లిముల మూక రాళ్ళు రువ్వి దాడి చేసింది. కొద్ది రోజుల తర్వాత మధ్యప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, ఒడిశా రాష్ట్రాల్లో రామనవమి శోభాయాత్రపై అనేక దాడులు జరిగాయి.

ఇది కేవలం 2022 సంవత్సరం ఏప్రిల్ మాసంలో ఇప్పటివరకు హిందువులపై జరిగిన దాడుల జాబితా మాత్రమే. ఒకసారి గూగుల్‌లో సెర్చ్ చేసి చూస్తే.. సుదీర్ఘ కాలంగా హిందూ సంప్రదాయ వేడుకల్లో భాగంగా జరిగే ఉత్సవాలు, శోభాయాత్రలపై ఇస్లామిస్టులు జరిపిన దాడుల వివరాలు వెలికి వస్తాయి. అలాంటి దాడి ఘటనలు దశాబ్దాల కాలంగా అనేక రాష్ట్రాల్లో, అనేక చోట్ల జరుగుతూ వస్తున్నాయి.

ముస్లిం ప్రాంతాలుగా చెప్పుకొనే ప్రాంతాల గుండా హిందూ శోభాయాత్ర చేపట్టిన కారణంగానే రాళ్ళ దాడులు జరుగుతున్నాయని చెప్పడం ద్వారా దాడి సబబైనదే అనే వాదన చేస్తున్నారు ఘనత వహించిన లౌకకవాదులు. వారి ప్రకారం ముస్లిం ప్రాంతాలు కేవలం ముస్లిములు మాత్రమే నివసించే ప్రాంతాలు. అక్కడ హిందూ వేడుకల సంగతి పక్కనపెడితే ఆఖరికి పోలీసులు, వైద్య సిబ్బందిని సైతం ఆ ప్రాంతంలోకి అడుగుపెట్టనివ్వరు.

80 శాతానికి పైగా హిందువులు ఉన్న భారత్‌లోని ఒక మహానగరంలో ‘ముస్లిమ్ ప్రాంతం’ అని చెప్పుకునే ఒకానొక ప్రాంతం ఒక్కనాటికి ముస్లిములకు మాత్రమే చెందినదికాదు. అక్కడ హిందువులు ఉంటారు. దేవస్థానాలు ఉంటాయి. హిందువుల దుకాణాలు, పాఠశాలలు నడుస్తుంటాయి. మన ఘనత వహించిన లౌకికవాదుల ప్రకారం ఆయా ప్రాంతాల్లో కేవలం ముస్లిములు మాత్రమే ఉండాలి. అక్కడి ముస్లిమేతరులు ఈ దేశపు రాజ్యాంగం ప్రసాదించిన స్వేచ్ఛకు లోబడి వారి మత విశ్వాసాన్ని పాటించరాదు.

ఇక ఘనత వహించిన లౌకికవాదులకు చెందిన మరో బృందం శోభాయాత్రను చేపట్టిన హిందువులపై అవాకులు చెవాకులు పేలుతోంది. చూడబోతే సదరు బృందం ప్రకారం హిందువులు వారి మతవిశ్వాసాలను వారి ఇంటికి మాత్రమే పరిమితం చేసుకోవాలి. రహదారులపై ధార్మికపరమైన యాత్రలను హిందువులు చేపట్టరాదు.

గురుగ్రామ్‌లో ప్రతి శుక్రవారం నమాజ్ కోసం మసీదులు, వక్ఫ్ ప్రాంగణాలకు తోడు బహిరంగ ప్రదేశాలైన రహదారులు, ఉద్యానవనాలను ముస్లిములు ఇష్టానుసారంగా వినియోగించుకోవడాన్ని ఇలాంటి లౌకికవాదులు ఆమోదిస్తారు. అదే హనుమాన్ జయంతి సందర్భంగా హిందువులు శోభాయాత్ర చేపడితే తప్పుపడతారు. గురుగ్రామ్‌లో బహిరంగ ప్రదేశాల్లో ముస్లిములు నమాజ్ చేయడానికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న స్థానికులు నమాజ్ చేస్తున్న వారిపై రాళ్ళు రువ్వడంలేదు. వారు చట్టబద్ధంగా, శాంతియుతంగా నిరసన తెలుపుతున్నారు. బహిరంగ ప్రదేశాలు ఆక్రమణకు గురికాకుండా చూడాలని అధికారులకు విన్నవించుకుంటున్నారు. వారిలో ఏ ఒక్కరూ రాళ్ళు రువ్వడంలేదు. బస్సులను తగలబెట్టడంలేదు.

దారుణమైన విషయం ఏమిటంటే.. దేశంలో అత్యధికంగా ఉన్న హిందువులపై కయ్యానికి కాలుదువ్వేవారిగా, నిత్యం అసహనంతో రగిలిపోయేవారు అనే ముద్రను మీడియా వేస్తున్నది. మొహర్రం ఊరేగింపులపై హిందువులు దాడి చేసిందిలేదు. అలాంటి వార్తలను మనం చూడలేదు. జనాభాలో 80 శాతానికి పైగా హిందువులు ఉన్న దేశంలో, ‘ముస్లిం ప్రాంతాలు’ కన్నా ఎక్కువగా ‘హిందూ ప్రాంతాలు’ ఉన్న భారత్‌లో రాళ్ళ దాడి, గృహ దహనాలు ఏకపక్ష వ్యవహారంగా మాత్రమే ఎందుకు మిగిలిపోయింది? ఈ దిశగా ఎవరైనా ఆలోచించారా?

ఒక్కమాటలో చెప్పాలంటే, ఒక ప్రణాళికతో ఉద్దేశ్యపూర్వకంగా జరిపే హింస పట్ల ఇస్లామిస్టులు, వారి మద్దతుదారులకు ఎలాంటి జవాబుదారీతనం ఉండదు. రాళ్ళ దాడి, గృహ దహనాల నేరాలకు మీడియా హడావిడిగా వెల్ల వేస్తుంది. మెరుపు మెరిసినట్టుగా బాధిత కార్డు అలా కనిపించి మాయమైపోతుంది. చట్టాన్ని ఏ మాత్రం గౌరవించని ప్రాంతాలను సృష్టించి వాటిని ‘ముస్లిము ప్రాంతాలు’ అని పిలిచే మనస్తత్వం ఒక వైరస్‌లా వ్యాపిస్తుంది.

అత్యధికంగా హిందువులతో కూడిన భారత్.. చట్టానికి లోబడి వారి వారి మత విశ్వాసాలను పాటించే స్వేచ్ఛను పౌరులందరికీ ప్రసాదించింది. ‘ముస్లిము ప్రాంతాలు’ అని ప్రచారం చేసే మనస్తత్వం 1947లో మన దేశాన్ని రెండు ముక్కలు చేసింది. బంగ్లాదేశ్‌లో నరమేధానికి దారి తీసింది. అనేక సంవత్సరాలుగా డజన్లకొద్దీ మత కల్లోలాలకు ఇదే మనస్తత్వం ఊతమిచ్చింది.

(ఓప్‌ఇండియా సౌజన్యంతో)