Home News ‘సంస్కారభారతి’ వ్యవస్థాపకులు బాబా యోగేంద్ర జీ అస్తమయం

‘సంస్కారభారతి’ వ్యవస్థాపకులు బాబా యోగేంద్ర జీ అస్తమయం

0
SHARE

అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ‘సంస్కారభారతి’ వ్యవస్థాపకులు బాబా యోగేంద్ర జీ (98) శుక్రవారం(జూన్ 10) ఉదయం స్వర్గస్తులైనారు.

బాబా యోగేంద్ర జీ 1924 సంవత్సరం జనవరి 7న ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో జన్మించారు. వారు బాల్యంలోనే తమ గ్రామంలో RSS శాఖలో చేరినారు. అనంతరం గోరఖ్‌పూర్‌లో విద్యాభ్యాసం సందర్బంగా RSS ప్రచారక్ నానాజీ దేశ్‌ముఖ్‌తో పరిచయం ఏర్పడింది. RSS ప్రశిక్షణ పొందిన అనంతరం బాబా యోగేంద్ర జీ ప్రచారక్ అయ్యారు.

బాబా యోగేంద్ర జీ గోరఖ్‌పూర్, ప్రయాగ, బరేలీ, బదాయు, సీతాపూర్‌లో ప్రచారక్‌గా ఉన్నారు. 1981లో తన 57వ యేట ‘సంస్కారభారతి’ పేరిట ఒక సంస్థను స్థాపించారు బాబా యోగేంద్ర జీ. వారి కృషి కారణంగా 41 సంవత్సరాల కాలంలో కళా రంగంలో అగ్రగణ్యమైన సంస్థగా సంస్కారభారతి రూపుదిద్దుకున్నది. భారత ప్రభుత్వం బాబా యోగేంద్ర జీని పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.

బాబా యోగేంద్ర జీ గురించి ఆ నోటా ఈ నోటా వినిపించే చాలా విషయాలు ఇక్కడ ప్రస్తావనకు అర్హమైనవి. వాటిలో ఒకప్పుడు వారి సంఘ్ శిక్షా వర్గ్‌లో ప్రదర్శన చేసినవి, చర్చకు నోచుకున్న తర్వాత ప్రసిద్ధి చెందిన ప్రదర్శనలను ఇప్పటికీ చెప్పుకుంటూ ఉంటారు. శివాజీ, ధర్మ గంగ, ప్రజల పిలుపు, కాలుతున్న కశ్మీర్, సంకటంలో గోమాత, 1857 నాటి స్వాతంత్ర్య పోరాట అమరగాథ, విదేశీ కుట్ర, అమ్మ పిలుపు, తదితర ప్రదర్శనలు అందరిని కదలించాయి. ‘భారత్ కీ విశ్వ్ కో దేన్’ (ప్రపంచానికి భారత్ అందిస్తున్నది) పేరిట నిర్వహించిన ప్రదర్శన విదేశాల్లో సైతం ప్రశంసలను అందుకుంది.

బాబా యోగేంద్ర జీ అస్తమయం పట్ల ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్రమైన సంతాపం వ్యక్తం చేశారు. “సంస్కారభారతి సంస్థాపకులు, అసంఖ్యాకమైన కళా సాధకులకు స్ఫూర్తిని ఇచ్చిన వారు, కళా రుషి, పద్మశ్రీ బాబా యోగేంద్ర జీ స్వరస్తులు కావడం అత్యంత దు:ఖదాయకమైనది. వారికి తమ పాదాల చెంత స్థానమివ్వాలని, వారి అసంఖ్యాకమైన అభిమానులకు ఈ దు:ఖాన్ని భరించే శక్తిని ఇవ్వాలని ప్రభు శ్రీరామచంద్రులవారిని ప్రార్థిస్తున్నాను” అని తమ సంతాప సందేశంలో యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు.