ఝల్కరీబాయి
ఝాన్సిరాణి తోడు ఝల్కరీ బాయేను
చిన్ననాడె జంపె చిరుతపులిని
పులివలెను చెలగెను తొలి స్వేచ్చ సమరాన
వినుర భారతీయ వీర చరిత
భావము
చిన్ననాడు పశువులకు కాపలాగా వెళ్ళి చిరుతపులితో పోరాడి దాని గొంతులో కర్ర దించి చంపింది. 1857 తొలి స్వతంత్ర సంగ్రామంలో ఝాన్సీ రాణి అనుచరురాలిగా ఉండి, బ్రిటిషు వాడిని ఏమార్చడానికి అపర ఝాన్సీలాగ వేషం గట్టి, వీరోచితంగా పోరాడిన ఝల్కరీబాయి వీర చరిత విను ఓ భారతీయుడా!
-రాంనరేష్