హిందూ పండుగలపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తన విద్వేషాన్ని ప్రదర్శిస్తున్నాడని విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర సహ కార్యదర్శి శశిధర్ పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నాడు. ఉత్తర భారత దేశంలో ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకొనే కన్వర్ యాత్రకు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ గారు విస్తృతమైన ఏర్పాట్లు చేసి భక్తులను స్వాగతిస్తుంటే హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసి ప్రజలు కట్టిన పన్నులు వృథా అవుతున్నాయని మాట్లాడుతూ తన హిందూ ద్వేషాన్ని ప్రకటిస్తున్నాడని పేర్కొన్నారు. హిందువులు దేవాలయాలలో సమర్పించిన లక్షలాది కోట్ల రూపాయల నుండే హిందూ పండుగలకు ప్రభుత్వాలు ఖర్చు చేస్తున్నాయి కానీ ప్రజలు కట్టిన పన్నుల నుండి కాదని ఓవైసి తెలుసుకోవాలని, తెలంగాణా ప్రభుత్వం కూడా హిందూ పండుగలకు దేవాదాయ శాఖ నుండే నిధులు మంజారు చేస్తుందని ఆయన తెలిపారు.
ప్రార్ధనా స్థలాల యాత్రలకు సబ్సిడీలు, పండుగలకు విందులు, ప్రార్ధనా స్థలాల మరమత్తులకు తెలంగాణ ప్రభుత్వ ఖజానా నుండి ఓవైసీ భాషలో చెప్పాలంటే ప్రజలు కట్టిన పన్నుల నుండి ప్రభుత్వం ఖర్చు పెట్టకూడదని అసదుద్దీన్ ఓవైసి తెలంగాణా ముఖ్యమంత్రి కి లేఖ రాయాలని, రాష్ట్ర ప్రభుత్వం ప్రజా ధనాన్ని వృథా చేయకుండా ఓవైసి కట్టడి చేయాలని, హిందూ పండుగలపై అసత్యప్రచారాలు ఓవైసి మానుకోవాలి హితవు పలికారు.
ఛత్రపతి శివాజీ చిత్రాల తొలగింపుపై టి.టి.డి. ఛైర్మన్ స్పందించాలి
తిరుమల కొండ పైకి వెళ్ళే వాహనాలపై ఛత్రపతి శివాజీ చిత్రాలు ఉంటే తొలగిస్తూన్నారంటూ భక్తులు ఆందోళన చేస్తూ, సామాజిక మాధ్యమాలలో వస్తున్న వార్తలపై టీ.టి.డి. ఛైర్మన్ సరైన చర్యలు తీసుకోవాలని వి.హెచ్.పీ డిమాండ్ చేస్తుందని శశిధర్ పేర్కొన్నారు. తిరుమల కొండపైకి ఇతర మతస్థుల గుర్తులు, చిహ్నలు తీసుకొని వెళ్ళడం పై ఉన్న నిషేధాన్ని హిందూ దేవి దేవతల చిత్రాలకు, హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించిన ఛత్రపతి శివాజీ చిత్రాలకు, సాక్షాత్తు వెంకటేశ్వరుని చిత్రాలకు కూడా అమలు చేయడం తీవ్రంగా ఖండించదగినదని ఆయన అన్నారు. ఇటీవల వెలుగు చూసిన అంశాలపై సమగ్రమైన విచారణ జరిపి సంబంధిత అధికారులపై వెంటనే క్రిమినల్ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.
ఇలాంటివి హిందూ వ్యతిరేక చర్యలే కాకుండా దేశ సమగ్రత సమైక్యతకు కూడా భంగం కలిగించే చర్యలు వెంటనే టి.టి.డి. ఛైర్మన్ ఈ విషయం పై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నామని, టి.టి.డి. నుండి వెంటనే అన్యమతస్థులైన ఉద్యోగులను తొలగించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.